రాహుల్‌కు కరోనా పరీక్షలు

  • Published By: madhu ,Published On : March 7, 2020 / 01:57 AM IST
రాహుల్‌కు కరోనా పరీక్షలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫిబ్రవరి 29వ తేదీనే ఈ పరీక్షలు చేయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం కాంగ్రెస్ ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవలే ఈయన ఇటలీ నుంచి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికే కరోనా భారతదేశంలో విజృంభిస్తోంది. ఇటలీ నుంచి రాగానే..రాహుల్..ఈశాన్య ఢిల్లీలో పర్యటించారు.

ఆయన వెంట పార్టీకి  చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. దీనిపై బీజేపీ నేతలు పలు కామెంట్స్ చేశారు. ఇటలీ నుంచి వచ్చిన రాహుల్, ఆయన తల్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటలీ నుంచి వచ్చిన చాలా మందికి కరోనా పాజిటివ్ అని తేలింది..కాబట్టి..రాహుల్ తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టులో పరీక్షలు చేయించుకున్నది లేనిది వెంటనే వెల్లడించాలని బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 29వ తేదీనే పరీక్షలు చేయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 

దేశంలో కరోనా వైరస్ కేసులు అధికమౌతున్నాయి. కోవిడ్ (కరోనా) ప్రభావిత దేశాల నుంచి ప్రతొక్కరికీ స్క్రీనింగ్ చేపడుతున్న సంగతి తెలిసిందే. హోదాతో నిమిత్తం లేకుండా..అందరికీ పరీక్షలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ..రెండు వారాల పాటు..ఇటలీలోని మిలాన్ నగరంలో గడిపారు. తిరిగి వచ్చిన ఆయన ఇతర ప్రయాణీకులతో పాటు..అరగంట పాటు క్యూలో నిలబడి..స్క్రీనింగ్ చేయించుకున్నారని కాంగ్రెస్ వెల్లడిస్తోంది. తనతోపాటు ఇటలీ నుంచి తిరిగొచ్చిన ఆఫీస్ స్టాప్, సెక్యూర్టీ సిబ్బంది కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలని రాహుల్ సూచించారంట. కరోనా లక్షణాలు ఏమీ కనబడకపోవడంతో రాహుల్‌ను పంపించివేశారు. కరోనా విషయంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొందరు నేతలు రాహుల్‌ని టార్గెట్ చేశారు. 

Read More : కరోనా వైరస్..3 వేల మంది బలి..