Rahul Gandhi: భారత్‌లో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం.. న్యూయార్క్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

భారతదేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతుంది. ఒకదానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. మరొక దానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi: భారత్‌లో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం.. న్యూయార్క్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi

Rahul Gandhi’s Visit To America: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమెరికా పర్యటన (America Tour) లో ఉన్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ (New York) లో జరిగిన భారతీయ సమాజ సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), బీజేపీ (BJP), ఆర్ఎస్ఎస్‌ (RSS)లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భవిష్యత్తును చూసే సత్తా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు లేదని, దేశంలో అవి విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. భారతదేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం ఉంది. ఒకటి మనం (కాంగ్రెస్) ప్రాతినిధ్యం వహిస్తుంది. మరొకటి బీజేపీ – ఆర్ఎస్ఎస్ భావజాలం. అయితే, ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకవైపు మహాత్మా గాంధీ, మరోవైపు నాథూరామ్ గాడ్సే అని రాహుల్ అన్నారు.

Rahul Gandhi: తదుపరి టార్గెట్ తెలంగాణ ఎన్నికలు.. ఏం చేస్తామంటే?: అమెరికాలో రాహుల్ గాంధీ కామెంట్స్

బీజేపీ – ఆర్ఎస్ఎస్ పని దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, కానీ మాపని (కాంగ్రెస్) దేశంలో అందరి ప్రజలకు ప్రేమను పంచడం అని రాహుల్ అన్నారు. కారు నడుపుతున్నప్పుడు ఎప్పుడూ వెనుకకు చూడలేమని, అలా చేస్తే ప్రమాదం జరుగుతుందని రాహుల్ అన్నారు. అదే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఎప్పుడూ గతం గురించి మాట్లాడుతారు. మరొకరిని నిందించాలనే ఆలోచనలో ఉంటారు అంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు. ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారు 50ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఏం చేసిందో చెబుతారు.. అదీ వారి సిద్ధాంతం. తప్పును కప్పిపుచ్చుకోవడానికి గతాన్ని తోడుతూ భవిష్యత్తులో మరోసారి తప్పు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై బీజేపీ దృష్టిసారించదని రాహుల్ విమర్శించారు.

Rahul Gandhi: ఐఫోన్ పట్టుకుని హలో మిస్టర్ మోదీ.. అంటూ రాహుల్ గాంధీ జోక్స్.. ఎందుకంటే?

యూఎస్‌లో భారతీయ – అమెరికన్ కమ్యూనిటీ వారు జీవిస్తున్న తీరును రాహుల్ ప్రశంసించారు. భారతదేశం నుంచి ఉద్భవించిన దిగ్గజాలందరూ కొన్ని లక్షణాలను కలిగి ఉన్నారని అన్నారు. మొదట వారు సత్యాన్ని శోధించారు. ప్రాతినిధ్యం వహించారు, పోరాడారు. అంతేకాదు వారు వినయస్థులు, వారిలో అహంకారం ఉండదు. అందుకే భారతీయులు ఇక్కడ విజయం సాధించారు. అందుకు నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను అంటూ రాహుల్ ప్రశంసించారు.