బియ్యంతో శానిటైజర్ తయారీ : పేదలు ఆకలితో అలమటిస్తే..ఇలా చేస్తారా ? రాహుల్ ట్వీట్ 

  • Published By: veegamteam ,Published On : April 22, 2020 / 06:44 AM IST
బియ్యంతో శానిటైజర్ తయారీ : పేదలు ఆకలితో అలమటిస్తే..ఇలా చేస్తారా ? రాహుల్ ట్వీట్ 

పేదలు ఆకలితో అలమటిస్తే..ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. శానిటైజర్ల ఉత్పత్తి కోసం బియ్యం సరఫరాకు అనుమతినిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆహార సంస్థ (FCI)లో ఉన్న మిగులు బియ్యంతో ఇథనాల్ ఉత్పత్తి చేసి శానిటైజర్లు తయారు చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతినిచ్చిందనే వార్తలు సంచలనం సృష్టించాయి. 

బియ్యం నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసి దాంతో శానిటైజర్లు తయారు చేస్తారనే వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై 2020, ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మీ భాగం బియ్యం నుంచి తయారు చేసిన శానిటైజర్లతో ధనవంతుల చేతులు శుభ్రం చేసే పనిలో ఉన్నారు..పేదల్లారా..ఎప్పుడు మేల్కొంటారు ? అంటూ ప్రశ్నించారు. 

మిగులు బియ్యాన్నిశానిటైజర్ గా మార్చే ప్రణాళిను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు వార్తలు వచ్చాయి. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన నేషనల్ బయోఫ్యూయల్ కో ఆర్డినేషన్ కమిటీ (NBCC) మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్త దుమారం రేపింది. స్టేట్ ఎక్సైజ్, స్టేట్ డ్రగ్ కంట్రోలర్ సహకారంతో చక్కెర కంపెనీలు హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించారు.