Rahul Gandhi :ట్విట్టర్ బ్లూ టిక్స్ పైనే కేంద్రం తాపత్రయమంతా

వ్యాక్సినేషన్​ విషయంలో మోడీ సర్కార్ తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

Rahul Gandhi :ట్విట్టర్ బ్లూ టిక్స్ పైనే కేంద్రం తాపత్రయమంతా

Rahul Gandhi Slams Centre For Fighting For Blue Ticks Amid Covid 19 Vaccine Shortage

Rahul Gandhi వ్యాక్సినేషన్​ విషయంలో మోడీ సర్కార్ తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మోడీ సర్కారు ప్రాధాన్యాలు మాత్రం వేరుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వం ట్విట్టర్​ బ్లూ టిక్​ మార్క్ కోసం తాపత్రయపడుతోంది. ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ కావాలనుకుంటే వారు సొంతంగా వ్యాక్సిన్ సంపాదించుకోవాలి(అత్మనిర్భర్ కావాలి)అని రాహుల్ ట్వీట్ చేశారు.

కాగా,శనివారం..ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్​తో పాటు పలువురి ప్రముఖుల ఖాతాలకు ట్విట్టర్.. బ్లూ టిక ను తొలగించింది. ఆరు నెలలుగా ఇనాక్టివేట గా ఉన్న ఖాతాలకు బ్లూ టిక్ ను తొలగిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. అయితే ట్విట్టర్ వ్యవహారశైలిపై కేంద్రం,నెటిజన్లు మండిపడ్డారు. నెటిజన్లు,ఆరెస్సెస్ వర్గాల నుంచి ట్విట్టర్ లో విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాన్ ట్విట్టర్ అంటూ హ్యాష్ ట్యాగ్ లతో ట్వీట్లు చేశారు నెటిజన్లు. ఈ క్రమంలో ట్విట్టర్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గి.. బ్లూ టిక్ లను పునరుద్ధరించింది.