Rahul Gandhi : కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చిన్న సాయం..అది కూడా చేయలేరా!

కరోనాతో చనిపోయిన కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.

10TV Telugu News

Rahul Gandhi కరోనాతో చనిపోయిన కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేయటాన్ని తప్పుపట్టిన రాహుల్ గాంధీ..ప్రాణానికి విలువ కట్టడం అసంభవమని,

మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వటం ఓ చిన్న సాయమని మోదీ ప్రభుత్వం అది కూడా చేయటానికి సిద్ధంగా లేదని రాహుల్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. మహమ్మారి వ్యాప్తి సమయంలో మొదట సరైన ట్రీట్మెంట్ అందించలేకపోయిన కేంద్ర ప్రభుత్వం…ఆ తర్వాత తప్పుడు లెక్కలు చూపించిందని రాహుల్ విమర్శించారు. కాగా,కరోనా మృతులకు పరిహారం చెల్లించటం ఆర్థికపరమైన అంశమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంత స్తోమత లేదని సుప్రీంకోర్టుకి కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది.

×