Rahul Gandhi : ఎన్నికల ప్రచారం నిర్వహించను..సభలు పెట్టను – రాహుల్ కీలక నిర్ణయం

ఎన్నికల ప్రచారాన్ని తాను నిర్వహించనని, సభలు కూడా పెట్టనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు.

Rahul Gandhi : ఎన్నికల ప్రచారం నిర్వహించను..సభలు పెట్టను – రాహుల్ కీలక నిర్ణయం

Rahul

Election Rallies : ఎన్నికల ప్రచారాన్ని తాను నిర్వహించనని, సభలు కూడా పెట్టనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. వెస్ట్ బెంగాల్ లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొన్న సంగతి తెలిసిందే. వెస్ట్ బెంగాల్ లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు ఐదు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. టీఎంసీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మరోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ, మమత బెనర్జీకి చెక్ పెట్టాలని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే…కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా..నేతలు ప్రచారాన్ని ఆపడం లేదు. ఈ క్రమంలో..రాహుల్ గాంధీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో ఎన్నికల ప్రచారం, ఎలాంటి సభలు నిర్వహించబోనని ప్రకటించారు. మిగతా రాజకీయ నాయకులకు ఇదే సూచన చేశారు. తనలాగే..ఎన్నికల సభలను రద్దు చేసుకోవాలని, కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఇలాంటి సమయంలో సభలు నిర్వహించడం అంత సబబు కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. బెంగాల్ లో చివరిసారిగా ఈనెల 14వ తేదీన రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ..ప్రజల్లో కలిసిపోతున్నారు. మరి రాహుల్ గాంధీ చేసిన సూచనపై ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Read More : Delhi : నిర్మానుష్యంగా ఢిల్లీ…మూతపడిన షాపులు, ఇళ్లలోనే ప్రజలు