Rahul Gandhi: ఆ స్థానంలో మన్మోహన్ ఉంటే రాజీనామా చేసేవారు: మోదీపై రాహుల్ విమర్శలు

చైనా-భారత్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం, మన్మోహన్ సింగ్ హయాంలో జరిగి ఉంటే, ఆయన రాజీనామా చేసి ఉండేవారు

Rahul Gandhi: ఆ స్థానంలో మన్మోహన్ ఉంటే రాజీనామా చేసేవారు: మోదీపై రాహుల్ విమర్శలు

Modi Rahu;

National Politics: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దేశ సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులను మోదీ దేశ పౌరులకు వివరించడంలేదంటూ మండిపడ్డ రాహుల్, భారత సరిహద్దులను కాపాడండంలో ప్రధాని మోదీ విఫలమయ్యారంటూ తీవ్ర విమర్శలు చేసారు. మంగళవారం రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, సమావేశ ముగింపు సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసారు. చైనా – భారత్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ విఫలం అయ్యారని అన్నారు. చైనా తాపీగా భారత్ సరిహద్దులను ఆక్రమిస్తుంటే మోదీ భజన చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం చైనా-భారత్ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం, మన్మోహన్ సింగ్ హయాంలో జరిగి ఉంటే, ఆయన రాజీనామా చేసి ఉండేవారని, ఇప్పుడు మోదీ కూడా రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

అదే సమయంలో ఆర్ఎస్ఎస్ పైనా రాహుల్ విమర్శలు చేసారు. ప్రేమను, మానవత్వాన్ని చాటిచెప్పాల్సిన ఆర్ఎస్ఎస్, బీజేపీతో కలిసి ద్వేషాన్ని పంచుతుందని రాహుల్ ఘాటు విమర్శలు చేసారు. దేశం నలుమూలలా విస్తరించిన ఆర్ఎస్ఎస్, బీజేపీతో కలిసి మతపరమైన సిద్ధాంతాలను వ్యాపింపజేస్తుందని రాహుల్ అన్నారు. వీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనీ చుస్తున్నారని, అది సాధ్యపడదని రాహుల్ పేర్కొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ మతపరమైన ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుందని, కానీ ప్రజలకు అది అవసరం లేదని సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పుకొచ్చారు.

Also Read: Hollywood Celebrity: విడాకులు తీసుకున్న భార్య వెంట పడుతున్న”సెలబ్రిటీ భర్త”