Rahul Gandhi: అచ్చేదిన్ వస్తాయని చెప్పినవారు ఎక్కడున్నారు?

అచ్చే దిన్.. బీజేపీ ప్రభుత్వం రాకముందు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన పదం ఇది.. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తన ప్రచారంలో ఎక్కువగా ఉపయోగించిన పదం ఇది.

Rahul Gandhi: అచ్చేదిన్ వస్తాయని చెప్పినవారు ఎక్కడున్నారు?

Modi

Rahul Gandhi: అచ్చే దిన్.. బీజేపీ ప్రభుత్వం రాకముందు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన పదం ఇది.. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తన ప్రచారంలో ఎక్కువగా ఉపయోగించిన పదం ఇది. అచ్చేదిన్ అంటే మంచిరోజులు.. గతంలో గూగుల్‌లో కూడా ఎక్కువ మంది వెతికి ఈ పదం రికార్డులకు ఎక్కింది. లేటెస్ట్‌గా ఇదే పదాన్ని ఉపయోగింది ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు రాహుల్ గాంధీ.

దేశంలో వేగంగా పెరుగుతున్న పేదరికంపై సర్వే నివేదికను పంచుకుంటూ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రమే లక్ష్యంగా విమర్శలు చేశారు. మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు పేదలయ్యారని, పేదవారు ఇప్పుడు నలిగిపోతున్నారని, అచ్ఛే దిన్‌ వస్తోందని చెప్పినవారు మాత్రం ఎక్కడున్నారో తెలియట్లేదని అన్నారు.

గడిచిన ఎనిమిదేళ్లలో భారతదేశంలో పేదరికం సంఖ్య వేగంగా పెరగిందని ఓ నివేదిక స్పష్టం చేయగా.. ఇప్పటివరకు ఈ విషయం ప్రధానికి కనిపించలేదని రాహుల్ విమర్శించారు.

ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందుల్లో సామాన్య ప్రజానీకం:
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై సామాన్య ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం లక్షల క్లెయిమ్‌లు చేస్తున్నప్పటికీ, ఆ వాదనలు సత్యదూరంగా ఉన్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు బడ్జెట్ నిర్వహణ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మార్కెట్‌లో నిత్యం పెరుగుతున్న పప్పులు, కూరగాయలు, నూనె, పాలు, వంటగ్యాస్ ధరలు సామాన్యుల వెన్ను విరుస్తున్నాయి. ఈ విషయంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.