కేరళ విద్యార్థినులకు రాహుల్​ మార్షల్​ ఆర్ట్స్​​ శిక్షణ..వీడియో

సోమవారం కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. మహిళల స్వీయరక్షణ కోసం ఉపయోగపడే ఓ మార్షల్​ ఆర్ట్స్​ టెక్నిక్స్ ను ఓ​ కాలేజీలోని విద్యార్థినులకు నేర్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కేరళ విద్యార్థినులకు రాహుల్​ మార్షల్​ ఆర్ట్స్​​ శిక్షణ..వీడియో

Rahul Gandhi

Rahul సోమవారం కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. మహిళల స్వీయరక్షణ కోసం ఉపయోగపడే ఓ మార్షల్​ ఆర్ట్స్​ టెక్నిక్స్ ను ఓ​ కాలేజీలోని విద్యార్థినులకు నేర్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎవరైనా తమను నెట్టివేస్తే.. నేల ఆధారం చేసుకుని, ఎలా పడిపోకుండా ఉండాలో విద్యార్థినులకు రాహుల్​ నేర్పించారు.

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొచ్చిలోని సెయింట్​ థెరిస్సా మహిళా కళాశాలను సోమవారం రాహుల్ సందర్శిచారు. కాలేజీ విద్యార్థినులతో ముచ్చటించిన రాహుల్ తనకు తెలిసిన జపనీస్​ మార్షల్​ ఆర్ట్స్​ ‘ఐకిడో’ను వారికి నేర్పించారు. ముందుగా.. ఒక విద్యార్థినిని నేలపై కూర్చోమని చెప్పారు. ఆమెను నెట్టమని మరో విద్యార్థినికి చెప్పి, ఎలా పడిపోకుండా ఉండాలో సూచించారు. అనంతరం.. మరో ఐదారుగురు విద్యార్థినులు ఆమెను నెట్టేందుకు ప్రయత్నించినా.. ఆ విద్యార్థిని పడిపోకుండా ఉండడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే ఐకిడో టెక్నిక్​ అని రాహుల్​ వివరించారు. ఈ వీడియోను కాంగ్రెస్​.. తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసింది.

పురుషుల కంటే మహిళలు చాలా శక్తిమంతులు అని కితాబిచ్చారు రాహుల్. పురుషుల కంటే మహిళలు చాలా శక్తిమంతమైనవారని,కానీ వారికి తమ శక్తి ఎంతటిదో తెలియక మగవారి చేతిలో మోసపోతుంటారని అన్నారు. ఈ సమాజం మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. తమ శక్తితో ఎదురవుతున్న ప్రతి సవాల్‌ను దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. సమాజంలో పురుషులు, మహిళలు సమానమని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో రాహుల్‌ విభేదించారు.