Rahul Gandhi: రాహుల్ పెళ్లి ముచ్చట.. ఆ రెండు లక్షణాలున్న అమ్మాయి దొరికితే పెళ్లికి రెడీ అంట..

రాహుల్‌ గాంధీని తన పెళ్లి గురించి ప్రస్తావించగా.. నేను పెళ్లికి వ్యతిరేకం కాదని, నాకు సరియైన అమ్మాయి దొరికితే పెళ్లిచేసుకోవటానికి సిద్ధమేనని క్లారిటీ ఇచ్చారు. అయితే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలని రాహుల్ చెప్పారు.

Rahul Gandhi: రాహుల్ పెళ్లి ముచ్చట.. ఆ రెండు లక్షణాలున్న అమ్మాయి దొరికితే పెళ్లికి రెడీ అంట..

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన పెళ్లిపై మరోసారి వివరణ ఇచ్చారు. నేను పెళ్లిచేసుకోబోయే అమ్మాయికి ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలని కోరుకుంటానని, అలాంటి లక్షణాలున్న అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమేనని రాహుల్ క్లారిటీ ఇచ్చారు. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో‌ఉన్న సమయంలో రాహుల్.. కర్లీ టేల్స్ ప్రతినిధి కామియా జానీతో ఫన్ చాట్ చేశారు. ఈ ఇంటర్వ్యూ‌ను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

Raghuram Rajan on Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు, చాలా… : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్

ఈ వీడియోలో రాహుల్‌ను తన పెళ్లి గురించి ప్రస్తావించగా.. నేను పెళ్లికి వ్యతిరేకం కాదని, నాకు సరియైన అమ్మాయి దొరికితే పెళ్లిచేసుకోవటానికి సిద్ధమేనని క్లారిటీ ఇచ్చాడు. అయితే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలని రాహుల్ చెప్పారు. మా అమ్మానాన్నలది ప్రేమ వివాహం అని, వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని రాహుల్ అన్నారు. అందువల్ల నా అంచనాలు కాస్తపైనే ఉంటాయని తెలిపారు. అయితే.. నేను పెళ్లి చేసుకోవాలంటే ప్రేమించే వ్యక్తి, తెలివైన అమ్మాయి అయితే చాలు అని రాహుల్ తన మనస్సులో మాటను చెప్పారు.

Rahul Gandhi: పంజాబ్‌ను ఢిల్లీ నుంచి నడపకూడదు.. కేజ్రీవాల్‌ను ఉద్దేశించి రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు

ఈ ఇంటర్వ్యూలో రాహుల్ తన డైట్ గురించి, తెలంగాణ వంటకాల గురించికూడా మాట్లాడారు. నేను ఇంట్లో ఉంటే కచ్చితంగా డైట్ పాటిస్తానని తెలిపాడు. బఠాణీ, పనస పండు మాత్రం అస్సలు నచ్చవని అన్నారు. భారత్ జోడో యాత్ర సమయంలో ఎన్నో రాష్ట్రాల వంటకాలను రుచిచూశానని, వాటిల్లో తెలంగాణ వంటకాలు నాకు కాస్త ఘాటుగా అనిపించాయని రాహుల్ తెలిపారు. ఆ ప్రాంతంలో వంటకాల్లో కొంచెం కారం ఎక్కువగా వేస్తారని రాహుల్ అన్నారు. నేను నాన్ వెజిటేరియన్ వంటకాలను ఇష్టంగా తింటానని చెప్పారు.