Rahul Gandhi : బాలికలకు ఇచ్చిన మాట .. హెలికాప్టర్ రైడ్‌కు తీసుకెళ్లిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ముగ్గురు బాలికలకు ఇచ్చిన మాట నెరవేర్చారు. రాహుల్ గాంధీతో హెలికాప్టర్ లో తిరగాలని ఉందని చెప్పగా రాహుల్ వారి కోరికను నెరవేర్చారు.

Rahul Gandhi : బాలికలకు ఇచ్చిన మాట .. హెలికాప్టర్ రైడ్‌కు తీసుకెళ్లిన రాహుల్ గాంధీ

Rahul Gandhi took 3 girls of MP on a helicopter ride, fulfilling his promise

Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఉత్సాహంగా కొనసాగుతు ఎంతోమందితో ముచ్చటిస్తున్నారు. వారి వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. చంటిపాపల నుంచి వృద్ధుల వరకు అందరితోను కలివిడిగా ఉంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు.ఈక్రమంలో తన పాదయాత్రలో రాహుల్ గాంధీ కొంతమంది బాలికలతో ముచ్చటించగా వారి ముద్దు ముద్దు కోరికలను వెల్లడించారు. అదేమంటే రాహుల్ తో కలిసి హెలికాప్టర్ లో తిరిగాలని కోరారు.దీంతో తప్పకుండా అంటూ భరోసా ఇచ్చారు. కానీ అది నిజమవుతుందని వారు అనుకోలేదు. కానీ రాహుల్ గాంధీ వారి కోరినకు తీర్చారు. ముగ్గురు బాలికలను హెలికాప్టర్ రైడ్ కు తీసుకెళ్లటంతో ఆ చిన్నారుల ఆనందం అంతా ఇంతా కాదు. అలా మధ్యప్రదేశ్ రాష్ట్రం గుడ్లి వద్ద తను బాలికలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు రాహుల్ గాంధీ.

మధ్యప్రదేశ్ రాష్ట్రం గుడ్లి వద్ద 20 నిమిషాల పాటుఆ ముగ్గురు బాలికలను హెలికాప్టర్ లో తిప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నవంబర్ 29న ఉజ్జయినిలో రాహుల్ పర్యటిస్తున్న సమయంలో.. సీతల్ పటిదార్ అనే 7Th క్లాస్ చదువుతున్న బాలిక, 10Th విద్యార్థిని అంతిమా పన్వర్, గిరిజ పన్వర్ లు ఓ సాంస్కృతిక కార్యక్రమంలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా వారితో రాహుల్ గాంధీ ఎన్నో విషయాలు మాట్లాడారు. మీకు ఏమి ఇష్టం? అంటూ అడిగారు.

వారి కలలు, ఆకాంక్షలు, చదువుల గురించి రాహుల్ అడిగి తెలుసుకున్నారు. దీంతో వారు తమ మనస్సులో మాటను బయటపెట్టారు. మేము మీతో కలిసి హెలికాప్టర్ రైడ్ చేయాలని ఉంది అని తెలిపారు. దానికి రాహుల్ దాందేముందు త్వరలోనే హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టేద్దాం అంటూ మాటిచ్చారు. ఆ తరువాత రాహుల్ తన పాదయాత్రను ముందుకు కొనసాగించారు.

ఈక్రమంలో బాలికలకు ఇచ్చిన మాటను నెరవేర్చారు. వారిని హెలికాప్టర్ లో ఎక్కించుకుని, టెక్నికల్ విషయాలను పైలట్ తో కలసి రాహుల్ వివరించారు. వారికి చాక్లెట్లు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఫోటోలు కూడా తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాకుండా,మీకు నచ్చిన కెరీర్ ఎంచుకోండి అంటూ సూచించారు.మీరు అనుకున్న లక్ష్యాలను సాధించటానికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా భయపడకుండా ముందుకు సాగాలని మీకు ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని రాహుల్ వారిని ప్రోత్సహించారు.