సీపీఎంపై ఒక్క మాట కూడా మాట్లాడను

భారతదేశమంతా ఒక్కటే అన్న మెసేజ్ ఇవ్వడానికే తాను కేరళ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2019 / 04:33 PM IST
సీపీఎంపై ఒక్క మాట కూడా మాట్లాడను

భారతదేశమంతా ఒక్కటే అన్న మెసేజ్ ఇవ్వడానికే తాను కేరళ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.

భారతదేశమంతా ఒక్కటే అన్న మెసేజ్ ఇవ్వడానికే తాను కేరళ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. గురువారం(ఏప్రిల్-4,2019) చెల్లెలె ప్రియాంకగాంధీతో కలిసి వయనాడ్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా రాహుల్ కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో కేంద్రం,ఆర్ఎస్ఎస్,మోడీ తమపైన.తమ భాష,సంస్కృతులపైన దాడి చేస్తున్నారన్న ఫీలింగ్ ఉందన్నారు.
Read Also : పవర్‌లోకి వస్తే ఈసీని జైలులో పెడుతా: బీఆర్‌.అంబేద్కర్ మనవడు

ఎన్నికల ప్రచార సమయంలో కేరళలోని అధికార సీపీఎం పార్టీ అన్నదమ్ములు,అక్కచెల్లెల్లు తనను విమర్శిస్తారని,కానీ తాను మాత్రం వారిని పల్లెత్తు మాట కూడా అననని అన్నారు.మొత్తం క్యాంపెయిన్ లో సీపీఎం గురించి ఒక్క మాట కూడా మాట్లాడబోనని రాహుల్ సృష్టం చేశారు.కాంగ్రెస్, సీపీఎంల మధ్య ఉన్న వైరం భవిష్యత్తులో కొనసాగుతుందని రాహుల్ తేల్చి చెప్పారు.

Read Also : లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు