Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ

బ్రిటన్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. భారతీయ సమాజంలో హింస - అహింస అనే అంశంపై ఎదురైన ప్రశ్నకు రాహుల్ తడుముకొంటున్నట్లు కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ

Rahuyl Gandhi

Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. భారతీయ సమాజంలో హింస – అహింస అనే అంశంపై ఎదురైన ప్రశ్నకు రాహుల్ తడుముకొంటున్నట్లు కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు రాహుల్ కొంత సమయం తీసుకున్నారు. ఈ విషయంలో మొదట నాకు గుర్తొచ్చే పదం క్షమాపణ. ఇది కచ్చితమైందేమీ కాదంటూ సమాధానమిచ్చారు. దాంతో అక్కడ చప్పట్లు మోగాయి.

దీనిపై సమాధానం చెప్పేందుకు ఆలోచిస్తున్నా అని రాహుల్ అనగా.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఇంతకుముందెవ్వరూ మిమ్మల్ని ఇటువంటి ప్రశ్న అడిగి ఉండకపోవచ్చని క్షమాపణలు చెప్పారు. దానికి బదులుగా ఇదేం పెద్ద ఇబ్బంది కాదు.. కాకపోతే మీకు వివరంగా సమాధానం ఇచ్చేందుకు ఆలోచించుకుంటున్నానని కాంగ్రెస్ నేత బదులివ్వడంతో సంభాషణ చిరునవ్వులతో ముగిసింది.

దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించగా.. కాంగ్రెస్ నేతలు అండగా నిలుస్తున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో నానమ్మ, తండ్రిని కోల్పోయిన బాధను బీజేపీ మిత్రులు అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నా. ఆయనకు ఎదురైన ప్రశ్నకు క్షమాపణ అనే ఒకే ఒక్క పదంతో బదులిచ్చారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అహింస అనే గాంధీ సిద్ధాంతాన్ని తక్కువ చేయొద్దంటూ రణదీప్ సుర్జేవాలా విమర్శలను తిప్పికొట్టారు.