Rahul Gandhi : మరో పాదయాత్రకు సిద్ధమవుతున్న రాహుల్ గాంధీ .. ఎక్కడనుంచి ఎక్కడికంటే..

 ‘భారత్ జోడో యాత్ర’ను విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారా...? అంటే నిజమనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

Rahul Gandhi : మరో పాదయాత్రకు సిద్ధమవుతున్న రాహుల్ గాంధీ .. ఎక్కడనుంచి ఎక్కడికంటే..

Rahul Gandhi's next pada yatra

Rahul Gandhi : ‘భారత్ జోడో యాత్ర’ను విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారా…? అంటే నిజమనంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం రాహుల్ గాంధీలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ జోష్ నిండింది. ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో ఈ ఉత్సాహాన్ని మరింతగా పెంచటానికి ఈసారి రాహుల్ గాందీ ప్రధాని మోడీ ఇలాకాల్లోంచే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచే మరో పాదయాత్రను చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది.

గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రం అసోం వరకు పాదయాత్ర చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గాంధీల వారసుడు రాహుల్ గాందీ తన మరో పాదయాత్రను మహాత్మా గాంధీ జన్మస్థలం నుంచే ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. గుజరాత్ లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోరుబందర్ లో మొదలై అసోంలో ముగుస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జన్మస్థలం పోరుబందర్ కు ప్రాధాన్యత ఉంది. ఫిబ్రవరి (2023)లో రాయ్ పూర్ లో ఏఐసీసీ ప్లీనరీ సమావేశం జరగనుంది. రాహుల్ తాజా పాదయాత్రపై ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. బహుశా అదే వేదికగా ప్రకటన కూడా చేస్తారని సమాచారం.

ఈ పాదయాత్రకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తేదీలు..రూట్ మ్యాప్ కసరత్తులో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. బహుశా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ప్రారంభం కావచ్చని అంచనా. అది కుదరకపోతే 2023 చివరిలో అయినా ఈ పాదయాత్ర జరుగుతుందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

కాగా 2022 సెప్టెంబర్ లో రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి కశ్మీర్ లో విజయవంతంగా ముగించారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతలు..75 జిల్లాల మీదుగా 145 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు ఈ భారత్ జోడో యాత్ర జరిగింది.

ఈ పాదయాత్రలో కొత్త రాహుల్ గాంధీ కనిపించారు. కొత్త గెటప్ లతోనే కాకుండా ఎంతోమంది నేతలు, మేధావులు, ఎన్జీవోలను కలిసారు. ఎంతోమంది రాహుల్ తో కలిసి అడుగులు వేశారు. ఎంతోమంది మేధావులు వారి వారి అనుభవాలను రాహుల్ తో పంచుకోవటానికి రాహల్ గాంధీ గతంలో కంటే మరింత పరిణితిని పెంచుకున్న నేతగా మారారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. రాహుల్ కు కూడా తన పాదయాత్రలో ఎన్నో నేర్చుకున్నాననని తెలిపారు.