Rahul Gandhi: ‘రాహుల్.. ఎందుకంత కోపం?’.. స్టేజి మీద రాహుల్ ప్రవర్తనపై బీజేపీ నేతల విమర్శలు
ప్రజలతో ఎలా ప్రవర్తించాలో రాహుల్ నేర్చుకోవాలి అంటూ బీజేపీ నేతలు సూచిస్తున్నారు. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక సభలో రాహుల్ ప్రవర్తించిన తీరు కారణంగా బీజేపీ నేతలు ఈ విమర్శలు చేస్తున్నారు.

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిత్యం ఎవరో ఒక బీజేపీ నేత, ఏదో ఒక అంశంపై రాహుల్‌ను విమర్శిస్తుంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అమిత్ మాలవీయ రాహుల్ గాంధీ ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు.
Ioniq 5 EV: హ్యుందాయ్ సంస్థ నుంచి ‘ఐకానిక్ 5 ఈవీ’ ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఇవే
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ రాజస్థాన్‌లో సాగింది. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ ఒక సభ నిర్వహించారు. పలువురు కాంగ్రెస్ నేతలతోపాటు, రాహుల్ గాంధీ ఈ సభకు హాజరయ్యారు. అయితే, స్టేజి మీద తోపులాట జరిగింది. చాలా మంది రాహుల్ గాంధీతో ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. రాహుల్‌ను అనేక మంది చుట్టుముట్టారు. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. రాహుల్ ఎదురుగా ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకోబోతుండగా, అతడిపై చిరాకుపడ్డాడు. రాహుల్ అతడి చేతిని బలంగా కిందికి దించేశాడు. చుట్టూ ఉన్న వాళ్లపై అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను బీజేపీ నేత అమిత్ మాలవీయతోపాటు, పలువురు నేతలు షేర్ చేస్తున్నారు.
Covid-19: చైనాలో పెరుగుతున్న కోవిడ్.. ఇండియాకు ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా?
ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల మధ్య ఎలా నడుచుకోవాలో రాహుల్ తెలుసుకోవాలి అని అమిత్ అభిప్రాయపడ్డాడు. మరో బీజేపీ నేత ‘ఏం జరుగుతోంది.. ఎందుకంత కోపం రాహుల్ గాంధీ’ అంటూ విమర్శలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాహుల్ వైఖరిపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
Rahul Gandhi needs lessons in how to conduct himself in public. pic.twitter.com/iDnPTM4iTO
— Amit Malviya (@amitmalviya) December 21, 2022