ED Raids : 8 ఏళ్లలో 27 రెట్లు పెరిగిన ఈడీ దాడులు..

గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈడీ దాడులు 27 రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2004-2014 మధ్య 112 ఈడీ దాడులు జరిగితే.. 2014-2022 మధ్య కాలంలో 3010 సార్లు ఈడీ దాడులు జరిగాయని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు.

ED Raids : 8 ఏళ్లలో 27 రెట్లు పెరిగిన ఈడీ దాడులు..

Raids Carried Out By The Ed During 2014 2022 Saw A Nearly 27 Fold Increased

ED Raids  : గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈడీ దాడులు 27 రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2004-2014 మధ్య 112 ఈడీ దాడులు జరిగితే.. 2014-2022 మధ్య కాలంలో 3010 సార్లు ఈడీ దాడులు జరిగాయని మంగళవారం (7,2022)రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద గతంలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం దాడులు జరపాల్సి వస్తోంది అంటూ వెల్లడించారు..

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) పరిపాలన కాలంలో నమోదైన FEMA, PMLA కేసుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. 2014-15 నుంచి 2016-17 వరకు నమోదైన కేసులకు దాదాపు మూడు రెట్ల కేసులు 2019-20 నుంచి 2021-22 వరకు నమోదయ్యాయి. జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ వురపు లలన్ సింగ్..శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది..అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ ప్రభుత్వం పార్లమెంటుకు ఈ వివరాలను తెలిపింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టింది. వరుసగా రెండవసారి 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు సోమవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపిన వివరాల ప్రకారం..ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (FEMA), మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (PMLA)ల ప్రకారం 2014-15 నుంచి 2016-17 వరకు 4,913 కేసులను నమోదు చేసింది. 2019-20 నుంచి 2021-22 వరకు 14,143 కేసులను నమోదు చేసింది. అంటే 187 శాతం పెరుగుదల కనిపించింది.

2019-20 నుంచి 2021-22 వరకు 11,420 ఫెమా కేసులను దర్యాప్తునకు చేపట్టినట్లు పంకజ్ తెలిపారు. 2014-15 నుంచి 2016-17 వరకు 4,424 కేసులను దర్యాప్తునకు చేపట్టినట్లు తెలిపారు. పీఎంఎల్ఏ కేసులు 2014-15 నుంచి 2016-17 వరకు 489 కేసులు నమోదు కాగా, 2019-20 నుంచి 2021-22 వరకు 2,723 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అంటే 456 శాతం పెరిగినట్లు వివరించారు.సంవత్సరాలవారీగా సమాచారాన్ని పరిశీలించినపుడు మోడీ 8ఏళ్ళ పదవీ కాలంలో 2021-22లో అత్యధిక సంఖ్యలో మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 2020-21లో ఈడీ ఫెమా క్రింద 5,313 కేసులను, 2017-18లో 3,627 కేసులను దాఖలు చేసింది. 2020-21లో 1,180 పీఎంఎల్ఏ కేసులను దాఖలు చేసింది.