Railway Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 2.65 లక్షల ఉద్యోగాలు

నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలో 2.65లక్షలు ఉద్యోగాలు ఉన్నట్టు ప్రకటించింది. త్వరలోనే ఈ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలిపింది

Railway Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 2.65 లక్షల ఉద్యోగాలు

Railway Jobs

Railway Jobs : నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలో 2.65లక్షలు ఉద్యోగాలు ఉన్నట్టు ప్రకటించింది. త్వరలోనే ఈ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. రైల్వే శాఖలో 2.65లక్షలకు పైగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటిని త్వరలోనే ఆయా బోర్డులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

దేశంలో అతిపెద్ద రవాణ వ్యవస్థ రైల్వే. ప్రతి రోజు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి మన ఇండియన్ రైల్వేస్. ప్రభుత్వ ఉద్యోగాలకు ధీటుగా రైల్వే జాబ్స్ కు సైతం విపరీతంగా పోటీ ఉంటుంది. రైల్వేలో కొలువును సొంతం చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక్కసారి రైల్వేలో జాబ్ కొడితే ఇక లైఫ్ సెటిల్ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది.

Chilli : మిరప కారం అధికంగా తింటే… వృద్ధాప్య ఛాయలు

రైల్వేలో ఉద్యోగ ఖాళీలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 2,65,547 ఖాళీలు ఉన్నట్లు పార్లమెంట్ లో వెల్లడించారు. సీపీఎం సభ్యుడు సదాశివన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా బదులు ఇచ్చారు. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఆయా నియామక సంస్థలకు ఇండెంట్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

* దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం ఖాళీలు – 2,65,547.
* గెజిటెడ్ – 2,177 ఖాళీలు
* నాన్ గెజిటెడ్ – 2,63,370 ఖాళీలు

తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే సౌత్ సెంట్రల్ రైల్వేలో 43 గెజిటెడ్, 16,741 నాన్ గెజిటెడ్ ఖాళీలు కలిపి మొత్తం 16,784 ఖాళీలు ఉన్నట్లు ఆయన వివరించారు.
దక్షిణ మధ్య రైల్వేలో..
* గెజిటెడ్ – 43 ఖాళీలు
* నాన్ గెజిటెడ్ – 16,741 ఖాళీలు

దేశ వ్యాప్తంగా గత ఐదేళ్లలో వివిధ జోన్లతో కలిపి గ్రూప్-సీ లెవల్-1 పోస్టులు 76,128.. మొత్తం 1,89,790 ఖాళీలను భర్తీ చేసినట్లు రైల్వే మంత్రి వెల్లడించారు.

WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

తాజాగా సెంట్రల్ రైల్వే భారీగా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,422 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జనవరి 17 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 16ను ఆఖరి తేదీగా. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://rrccr.com/Home/Home లో అప్లయ్ చేసుకోవాలి.