Railways Minister Tweet: బేబీ ఉన్నది రైల్లోనా? విమానంలోనా..? రైల్వే మినిస్టర్ ఆసక్తికర ట్వీట్ .. మీరేమైనా చెప్పగలరా?

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా నిత్యం ఏదోఒక ఆసక్తికర ఫోస్టు చేస్తుంటారు. వినోద భరితమైన ఫొటోలు, సందేశాలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆలోచింపజేస్తారు. తాజాగా రైల్వేశాఖ మంత్రి ఓ ఆసక్తికరమైన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Railways Minister Tweet: బేబీ ఉన్నది రైల్లోనా? విమానంలోనా..? రైల్వే మినిస్టర్ ఆసక్తికర ట్వీట్ .. మీరేమైనా చెప్పగలరా?

Railways Minister Tweet

Railways Minister Tweet: రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా నిత్యం ఏదోఒక ఆసక్తికర ఫోస్టు చేస్తుంటారు. వినోద భరితమైన ఫొటోలు, సందేశాలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆలోచింపజేస్తారు. తాజాగా రైల్వేశాఖ మంత్రి ఓ ఆసక్తికరమైన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఓ బేబీ ప్రయాణిస్తున్న సమయంలో పడుకొని కిటికీలో నుంచి చూస్తున్నట్లుగా ఫొటో ఉంది. ఈ ఫొటోను షేర్ చేసిన రైల్వే శాఖ మంత్రి నెటిజన్లకు ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు. ఈ ఫొటోలో ఉన్న బేబీ  రైల్‌లో ఉన్నారా? విమానాలో ఉన్నారా? చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.

Wedding Photoshoot : కెమెరామెన్‌ దిమ్మతిరిగిపోయింది.. ఫొటోలకు ఫోజులివ్వమంటే.. ముద్దులతో రెచ్చిపోయిన జంట .. వీడియో వైరల్

రైల్వేశాఖ మంత్రి షేర్ చేసిన ఫొటో ప్రకారం.. బేబీ రైలులో ప్రయాణిస్తూ, విశాలమైన మెత్తటి సీటుపై పొడుకొని బయట ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు ఉందంటూ నెటిజన్లు సమాధానం ఇస్తున్నారు. అయితే ఈ ఫోటో.. రైల్వే కోచ్ లోపలి భాగాన్ని చూపుతుంది. ప్రయాణీకులకు, ప్రత్యేకించి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అదనపు సౌకర్యాన్ని అందించడానికి భారతీయ రైల్వే అమలు చేస్తున్న సౌకర్యాలను చెబుతూ రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇలా పేర్కొన్నారు. ఈ ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. కేంద్ర మంత్రి తన ట్విటర్ ఖాతాలో ఫొటోను షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 23వేల కంటే ఎక్కువ లైక్‌లు పొందింది. మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.

 

 

మంత్రి అశ్విని వైష్ణ‌వ్.. దేశంలో రైల్వే పురోభివృద్ధిని తెలియజేస్తూ, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అద్భుత దృశ్యాలను ఎప్పుడూ షేర్ చేస్తూ.. రైల్వే‍‌శాఖ ప్రయాణీకులకోసం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ ఉంటారు. అంతేకాక ఆహ్లాదకరమైన ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో గత సంవత్సరం శ్రీనగర్ రైల్వే స్టేషన్ వద్ద మంచుతో కప్పబడిఉన్న అనేక అద్భుతమైన ఫొటోను కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ఈ ఫొటోను నెటిజన్లను అమితంగా ఆకర్షించాయి.