Railway Minister Ashwin Vaishnav : ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రెండు రైళ్లు…!

ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్‌ ప్రోగ్రామ్‌ ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలోకి కూడా వచ్చి చేరింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్‌ - వాడి - ము

Railway Minister Ashwin Vaishnav : ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రెండు రైళ్లు…!

Railway Minister Ashwin Vaishnav

Railway Minister Ashwin Vaishnav :  మీరు రైలులో ప్రయాణం చేస్తున్నారనుకోండి. అదే ట్రాక్ పై ఇంకో రైలు ఎదురుకుండా వస్తోదనుకోండి. ఈ దృశ్యాన్నిమీరు ప్రత్యక్షంగా చూస్తున్నారనుకోండి…. ఎలా ఉంటుంది.. తరువాత జరగబోయే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే…. భయం వేసి చెమటలు పడతాయి. అది పాత పరిస్ధితి… కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇలాంటి రైలు ప్రమాదాలు అరికట్టటానికి రైల్వే శాఖ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఇకముందు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ అంటున్నారు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్.

ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్‌ ప్రోగ్రామ్‌ ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలోకి కూడా వచ్చి చేరింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్‌ – వాడి – ముంబై   మార్గంలో కవచ్‌ను అమల్లోకి తేనున్నారు. అందులో భాగంగా మొదట లింగంపల్లి – వికారాబాద్‌ సెక‌్షన్‌ను కవచ్‌ పరిధిలోకి తెచ్చారు.  దీంతో ఈ సెక‌్షన్‌లో ఇకపై రైలు ప్రమాదాలు దాదాపుగా నివారించినట్టే.
Also Read : Gaddiannaram Market : గడ్డి అన్నారం మార్కెట్‌ను వెంటనే తెరవాలని హైకోర్టు అదేశం

కవచ్ పరిధిలో ఉన్న ట్రాక్‌లో ప్రత్యేకమైన సెన్సర్లు అమర్చుతారు. వీటి వల్ల ఒకే ట్రాక్‌పై రైళ్లు ఎదురుదెరుగా వచ్చినప్పుడు లేదా ఒక దాని వెనుక మరొకటి   వేగంగా వస్తూ ఢి కొట్టే సందర్భాలు పూర్తిగా నివారించబడతాయి.  ప్రమాదాలను ముందుగానే పసిగట్టే వ్యవస్థలు రైళ్ళను ఆటోమేటిక్‌గా ఆపేస్తాయి.  అంతేకాదు రెడ్‌ సిగ్నల్‌ ఉన్నా కూడా రైలు ముందుకు దూసుకువస్తుంటే కూడా కవచ్‌ యాక్టివేట్‌ అవుతుంది. వెంటనే రైలును ఆపేస్తుంది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ రోజు హైదరాబాద్ లోని లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ఈరోజు నిర్వహించిన  ట్రయల్ రన్ లో   కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఒక రైలులో ఉండగా,  దానికి ఎదురుగా వస్తున్న మరో   రైలులో కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్  సీఈవో   వినయ్ కుమార్ త్రిపాఠీ ప్రయాణించారు. ఈ రెండు రైళ్లు లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్‌లో   ఎదురెదురుగా వచ్చాయి.

అయితే సరిగ్గా ఈ రెండు రైళ్ల మధ్య దూరం 380 మీటర్లు దూరం ఉండగా.. కవచ్ దీన్ని గుర్తించింది, వెంటనే ఆటో మేటిక్ బ్రేక్ లు పడి రైళ్లు ఆగిపోయాయి. ఇక వంతెనలు మలుపులు ఉన్నచోట రైలువేగాన్ని 30 కిలో మీటర్లు మించకుండా ఆటో మేటిక్ గా కంట్రోల్ చేసింది. ఇందుకు సంబంధించిన అన్ని వీడియోలను కేంద్రమంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కవచ్ అంటే ఏమిటి…
రైళ్లలో భధ్రత వాటి సామర్ధ్యాన్ని పెంచటానికి పూర్తి స్వదేశంలో తయారు చేసిన ప్రపంచస్ధాయి సాంకేతికత    కవచ్  పరిధిలోకి 2,000 కిలో మీటర్ల రైల్వే   నెట్ వర్క్   తీసుకు రానున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి   నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.   ఈ సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి   తీసుకువస్తే  10 వేల ఏళ్లలో ఒక  తప్పిదం మాత్రం జరిగే అవకాశం ఉందని, జీరో ప్రమాదాలే లక్ష్యంగా   దీన్నితయారు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.  రెడ్‌ సిగ్నల్‌ పడినా డ్రైవర్  రైలును ముందుకు తీసుకు వెళ్తుంటే కూడా కవచ్‌  యాక్టివేట్‌ అవుతుంది. వెంటనే రైలును ఆపేస్తుంది.