గుడ్ న్యూస్  : రైల్వే కూలీలకు ‘ఆయుష్మాన్’

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 08:08 AM IST
గుడ్ న్యూస్  : రైల్వే కూలీలకు ‘ఆయుష్మాన్’

ఢిల్లీ: రైల్వే కూలీలకు..సహాయకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో లైసెన్సు కలిగిన 20 వేలమంది రైల్వే కూలీలకు, సహాయకులకు… రైల్వే సిబ్బంది మాదిరిగానే వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ పథకం అమలైతే రైల్వే కూలీలు.. సహాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు రైల్వే ఆసుపత్రులలో ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయి. అంతేకాదు ఉచితంగా ట్రైన్‌పాస్.. రెస్ట్‌రూం వంటి పలు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 
 

అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో పేరు నమోదు చేయించుకున్న రైల్వే కూలీలు..సహాయకులు ఈ సదుపాయలు పొందవచ్చు. ఈ క్రమంలో వారు చికిత్స పొందిన తరువాత దానికి సంబంధించిన ఖర్చును ఆయుష్మాన్ విభాగం నుంచి రైల్వేశాఖ వసూలు చేయనుంది. కాగా రైల్వే కూలీలకు ప్రతీయేటా రెండుసార్లు యూనిఫారం ఇస్తున్న క్రమంలో ఇకపై ఏడాదికి మూడు యూనిఫారాలు ఇవ్వనున్నారు.