CBI Probe: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి

మృతుల సంఖ్య తగ్గడానికి గల కారణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. "బాలాసోర్ జిల్లా కలెక్టర్ వివరణాత్మక నివేదిక అనంతరం 275గా మరణించారని స్పష్టమైంది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు వెల్లడైంది. ఆ తప్పిదాన్ని సరి చేశాము" అని ఆయన అన్నారు

CBI Probe: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి

Odisha Train Accident

Odisha Train Accident: 275 మందికి బలిగొన్న ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయించాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ “275 మంది ప్రాణాలను బలిగొనడంతో పాటు 1,000 మందికి పైగా గాయపడిన ట్రిపుల్ రైలు ప్రమాదంపై మేము సీబీఐ విచారణకు సిఫార్సు చేసాము’’ అని స్పష్టం చేశారు. బాలాసోర్, కటక్, భువనేశ్వర్‌లోని వివిధ ఆసుపత్రులలో చేరిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతోందని ఆయన అన్నారు.

Gautam Adani: ఒడిశా రైలు ప్రమాదంలోని చిన్నారులకు చదువు చెప్పిస్తామని ముందుకు వచ్చిన అదానీ

‘‘ఆసుపత్రుల్లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. రోగులను వైద్యులు, ఇతర సిబ్బంది 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది” అని వైష్ణవ్ తెలిపారు. వాస్తవానికి ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంఖ్య 288 ఉంటుందని తొలుత ఒడిశా ప్రభుత్వం చెప్పింది. అనంతరం ఆ సంఖ్యను 275కు తగ్గించింది. ఇదే సమయంలో గాయపడిన వారి సంఖ్యను 1,175 గా పేర్కొంది.

Odisha Train Accident : ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. 288కి పెరిగిన మృతుల సంఖ్య

మృతుల సంఖ్య తగ్గడానికి గల కారణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. “బాలాసోర్ జిల్లా కలెక్టర్ వివరణాత్మక నివేదిక అనంతరం 275గా మరణించారని స్పష్టమైంది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు వెల్లడైంది. ఆ తప్పిదాన్ని సరి చేశాము” అని ఆయన అన్నారు. మూడు రైళ్లు- షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ సహా ఒక గూడ్స్ రైలు శుక్రవారం సాయంత్రం ఢీకొట్టుకున్నాయి. భారతదేశంలోని అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా ఇది నిలిచింది.