Indian Railways : ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం, ప్యాసింజర్లకు డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు

డిస్పోజల్ బెడ్ షీట్లను అందించిందుకు చర్యలు తీసుకొంటోంది. వీటితో పాటు టూత్ పేస్టు, మాస్క్, బెడ్ షీట్లను కూడా అందించనుంది.

Indian Railways : ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం, ప్యాసింజర్లకు డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు

Rail

Disposable Blanket-Pillow : రైల్లో ప్రయాణించే ప్యాసింజర్ల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. తాజాగా డిస్పోజల్ బెడ్ షీట్లను అందించిందుకు చర్యలు తీసుకొంటోంది. వీటితో పాటు టూత్ పేస్టు, మాస్క్, బెడ్ షీట్లను కూడా అందించనుంది. అయితే..ఈ సదుపాయం కేవలం ఎంపిక చేసిన ట్రైన్ లలో మాత్రమే ఉండనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటికి డబ్బులు చెల్లించాలి. ఇందులో మూడు రకాలు ఉండనున్నాయి. ఒక కిట్ లో నాన్ ఓపెన్ పిల్లో, దానికి ఒక కవర్, డిస్పోజల్ బ్యాగ్, టూత్ పేస్టు, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్, పెప్పర్ సోప్, టిష్యూ పేపర్లు ఉండనున్నాయి.

Read More : MS Dhoni: సెకండ్ రిచెస్ట్ క్రికెటర్.. ధోని నికర ఆస్తుల విలువెంతో తెలుసా?

ఈ కిట్ కు రూ. 300 ధర నిర్ణయించారు. ఇవన్నీ కాకుండా..కేవలం ఒక దుప్పటిని మాత్రమే కొనుగోలు చేయాలని అనుకుంటే…రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ ఎంపిక చేసిన రైళ్లలో సంబంధిత కార్మికులు వీటిని అమ్ముతారని అధికారులు తెలిపారు. డిస్పోజబుల్ బెడ్ షీట్ కిట్ ల ధరలు జోన్ లను బట్టి మారుతాయని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో దుప్పట్లు, దిండ్లు, షీట్లు మాత్రమే అందిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో టూత్ పేస్టు, శానిటైజర్ లు కిట్ లలో ఉంటున్నాయి.

Read More : Avijit Roy Murder : బంగ్లాదేశ్‌లో హత్య..ఆ దోషుల్ని పట్టిస్తే రూ.37 కోట్లు బహుమతి ప్రకటించిన అమెరికా

సదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే ప్రయాణీకుల కోసం వీటిని అందుబాటులోకి తేవడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ముంబై – ఢిల్లీ ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్, గోల్డెన్ టెంపుల్ మెయిల్, ముంబై – ఢిల్లీలో రాజధాని ఎక్స్ ప్రెస్, పశ్చిమ్ ఎక్స్ ప్రెస్ లలో అందుబాటులో ఉంది.