Railways : రైలు ప్రయాణికులకు షాక్, ఇకపై రాత్రి పూట అవి పని చెయ్యవు

ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుని రైళ్లలో అగ్నిప్రమాదాలను నిరోధించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఇకపై అవి పని చెయ్యవు.

Railways : రైలు ప్రయాణికులకు షాక్, ఇకపై రాత్రి పూట అవి పని చెయ్యవు

Railways No Charging

Railways No Charging : ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుని రైళ్లలో అగ్నిప్రమాదాలను నిరోధించేందుకు భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణికులు రైలు కోచ్ లలో చార్జింగ్‌ పాయింట్లను ఇకపై ఉపయోగించలేరు. అంటే.. రైళ్లలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఛార్జింగ్‌ పాయింట్లు స్విచ్చాఫ్ చేయనున్నారు. ఈ మేరకు పశ్చిమ రైల్వే రెండు వారాల క్రితమే మార్పులు చేసింది.

Railways' sleeper & general coaches to have more mobile charging points

ఇటీవల (మార్చి 13,2021) ఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చార్జింగ్ పోర్ట్స్ ఓవర్ హీట్ కావడం వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే రాంచీ స్టేషన్ లో గూడ్స్ ట్రైన్ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదల ఘటనల నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో చార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్చాఫ్ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది’ అని వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు.

charging points

ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు సహా ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలకు రాత్రిపూట చార్జింగ్‌ పెట్టే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదవశాత్తు వాటి వల్ల రైళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాలను అవసరానికి మించి ఛార్జింగ్‌ చేస్తుండడం వల్ల చార్జింగ్ పాయింట్లు ఓవర్ హీట్ అయ్యి అనేకసార్లు స్వల్పస్థాయిలోనైనా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో రాత్రి సమయంలో చార్జింగ్ పాయింట్లు పని చెయ్యకుండా చెయ్యాలని నిర్ణయించారు. అన్ని రైల్వే జోన్లలో ఈ నిబంధనలను అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. నిజానికి రాత్రిపూట ఛార్జింగ్‌కు వీల్లేకుండా చేయాలని 2014లోనే రైల్వే భద్రత కమిషనర్‌ ఆదేశించారని రైల్వే అధికారులు వెల్లడించారు. దానిపై రైల్వేబోర్డు తాజాగా అన్ని జోన్లకు మరోసారి ఆదేశాలు ఇచ్చిందన్నారు.

trains

సో.. ఇకపై రాత్రి పూట రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీ మొబైల్ లేదా ల్యాప్ ట్యాప్.. మరేదైనా.. ఎలక్ట్రానిక్ పరికరం ఉన్నా… రైలు ఎక్కేముందే ఫుల్ గా చార్జింగ్ ఉండేలా చూసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు.