ఆశలపై నీళ్లు : భారత్-శ్రీలంక తొలి టీ20 రద్దు

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 02:07 AM IST
ఆశలపై నీళ్లు : భారత్-శ్రీలంక తొలి టీ20 రద్దు

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభిద్దామనుకున్న భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. వర్షం కారణంగా పిచ్‌ తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

న్యూఇయర్‌ను విక్టరీతో స్టార్ట్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. ఆదివారం శ్రీలంకతో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌ రద్దుకు వర్షంతోపాటు మైదానం సిబ్బంది తప్పిదాలు కూడా కారణమయ్యాయి. పిచ్‌పై నీరు కారేలా నిర్లక్ష్య ధోరణితో సిబ్బంది వ్యవహరించడం వల్లే తొలి టీ20 జరగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ మొదలవుతుందనగా వర్షం కురిసింది. దాదాపు అరగంటపాటు వర్షం కురిసింది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసేందుకు ప్రయత్నించారు సిబ్బంది. 

కానీ పిచ్‌పై కప్పి ఉంచిన కవర్‌ను తీసే విషయంలో అవగాహన లోపం కారణంగా అత్యుత్సాహంగా వ్యవహరించారు. దీంతో పిచ్‌పై కొంతనీరు చేరింది. ఆ తర్వాత పిచ్‌ను సిద్ధం చేసేందుకు క్యూరేటర్‌తో కలిసి దాదాపు గంటన్నరపాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. హెయిర్ డ్రైయర్, రోలర్స్‌ను ఉపయోగించినా లాభం లేకపోయింది. పిచ్‌పై తడి అలాగే ఉండటంతో ఆటగాళ్లు గాయపడే ప్రమాదముందని అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో.. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు నిరాశే ఎదురైంది.

తొలి మ్యాచ్‌ రద్దవడంతో ఈ సిరీస్‌ను చేజిక్కించుకోవాలంటే ఇరు జట్లు మిగిలిన 2 మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే… ఇప్పటివరకు టీ-20 ఫార్మాట్‌లో ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌లోనూ భారత్ ఓడిపోలేదు. కానీ… తొలి టీ20 రద్దవడంతో ఇపుడు మిగిలిన మ్యాచ్‌లలో ఏ ఒక్కటి ఓడినా ఆ రికార్డుకు గండి పడే అవకాశం ఉంది.

* టీమిండియా ఆశలపై నీళ్లు
* భారత్-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్ రద్దు
* మ్యాచ్‌కు విలన్‌గా మారిన వరుణుడు
* పిచ్‌ తడిగా మారడంతో రద్దు చేసిన అంపైర్లు

Also Read : గుండెలు పిండేసే వీడియో: ఎందరికో ఇన్స్‌పిరేషన్.. వికెట్ల మధ్య పరుగు