రుతుపవనాల ఆలస్యం : నెలాఖరు వరకు వర్షాలు!

  • Published By: madhu ,Published On : September 20, 2019 / 02:56 AM IST
రుతుపవనాల ఆలస్యం : నెలాఖరు వరకు వర్షాలు!

సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాల తిరోగమనం ఆలస్యం కావడం ఇందుకు కారణమని వెల్లడిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఉపసంహరణ జరగాల్సి ఉందని..అయితే అలా జరగలేదన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు. దీనివల్ల తూర్పు నుంచి పడమరవైపు గాలులు వీస్తాయని, ఫలితంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రుతుపవనాలు వెళ్లాలంటే తేమ తగ్గాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితి కనిపించడం లేదని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఐదు రోజుల పాటు వర్షం ఉండకపోతే తేమ వస్తుందన్నారు. రుతుపవనాలు ఇప్పటికీ మధ్య, పశ్చిమ భారతదేంలో చురుకుగా ఉన్నట్లు, దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. మొత్తానికి రుతుపవనాల ఉపసంహరణ నెలాఖరులో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

ఇటీవలే వచ్చిన వాయు తుఫాన్ ఎఫెక్ట్ ఉందని వెదర్ ఎక్స్‌పర్ట్ వెల్లడించారు. జూన్, జులైలో వర్షపాతం లోటు కనిపించిందని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం, అదనపు వర్షం నమోదైందన్నారు.