Raj Kundra Porn : రాజ్‌కుంద్రా పోర్న్ ఫిలిమ్స్ కేసు.. ఇక్కడ షూటింగ్, అక్కడ అప్ లోడ్..

అశ్లీల చిత్రాల కేసులో న‌టి శిల్పా శెట్టి భ‌ర్త, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమ‌వారం(జూలై 19,2021) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ సంచలనమైంది. ఇంతకీ రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ ఎలా నడిపారు? వీడియోలు ఎవరితో ఎక్కడ తీశారు? ఎలా అప్ లోడ్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.

Raj Kundra Porn : రాజ్‌కుంద్రా పోర్న్ ఫిలిమ్స్ కేసు.. ఇక్కడ షూటింగ్, అక్కడ అప్ లోడ్..

Raj Kundra Porn

Raj Kundra Porn : అశ్లీల చిత్రాల కేసులో న‌టి శిల్పా శెట్టి భ‌ర్త, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమ‌వారం(జూలై 19,2021) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ సంచలనమైంది. ఇంతకీ రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ ఎలా నడిపారు? వీడియోలు ఎవరితో ఎక్కడ తీశారు? ఎలా అప్ లోడ్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.

ఐపీసీ 420 (చీటింగ్‌), 34 (కామ‌న్ ఇంటెన్ష‌న్‌), 292 and 293 (అశ్లీల చిత్రాల మేకింగ్‌) సెక్ష‌న్ల కింద కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఓ మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోర్న్ రాకెట్ గుట్టు బ‌య‌ట‌ప‌డింది. ​శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాలు.. 2009, న‌వంబ‌ర్ 22న పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

ఔత్సాహిక న‌టీన‌టుల‌తో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ కేసును న‌మోదు చేశారు. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీల‌క సూత్ర‌ధారి అని, ఈ విష‌యంలో త‌మ దగ్గర బోల‌డ‌న్ని ఆధారాలు ఉన్న‌ట్లు ముంబై పోలీసు క‌మీష‌న‌ర్ తెలిపారు. పోర్న్ ఫిల్మ్స్‌ను యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్న కేసులో రాజ్‌కుంద్రాను అరెస్టు చేశామ‌ని, ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంద‌ని క‌మిష‌న‌ర్ హేమంత్ న‌గ‌రేల్ తెలిపారు. కుంద్రాతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది మందిని అదుపులోకి తీసుకున్నారు.

ముంబై పోలీసుశాఖ‌కు చెందిన ప్రాప‌ర్టీ సెల్.. పోర్న్ వీడియోలు చేస్తున్న‌ ఓ ముఠాను ప‌ట్టుకుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామ‌న్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియ‌లు తీశారు. ఈ కేసులో న‌టుడు గెహ‌నా విశిష్ట్‌ను కూడా అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలు షూట్ చేసిన త‌ర్వాత‌.. వాటిని వీ ట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా విదేశాల‌కు పంపిస్తారు. భార‌తీయ చ‌ట్టాల నుంచి త‌ప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాల‌ను అక్క‌డి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ కేసును విచారిస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ విష‌యాలు తెలిసాయి. ఉమేశ్ కామత్ అనే వ్య‌క్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అత‌ను రాజ్‌కుంద్రా దగ్గర ప‌నిచేసేవాడు. ఉమేశ్ కామ‌త్‌ను అరెస్టు చేసిన త‌ర్వాతే.. ఆ పోర్న్ రాకెట్‌లో కుంద్రా పాత్ర ఉన్న‌ట్లు తేలింద‌ని పోలీసులు చెప్పారు. అయితే ప‌క్కా ఆధారాలు దొరికిన త‌ర్వాత‌నే కుంద్రాను అరెస్టు చేశామ‌న్నారు.

కుంద్రా ఆఫీసు నుంచే వీట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా ఫైల్స్‌ను విదేశాల‌కు పంపేవాళ్లని పోలీసులు తెలిపారు. న‌ట‌న‌పై ఆస‌క్తి ఉండి, ఆ కెరీర్‌లో ముందుకు వెళ్దామ‌ని వ‌చ్చే యువ యాక్ట‌ర్ల‌ను పోర్న్ రాకెట్ గ్యాంగ్ వ‌ల‌వేసి ప‌ట్టుకునేది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల్లో మంచి పాత్ర‌లు క‌ల్పిస్తామ‌ని చెప్పి.. వారితో అశ్లీల చిత్రాలు తీయించేవారు. పోర్న్ రాకెట్ న‌డుపుతున్న ముఠా నిందితుడికి ఒక వీడియోతో రెండు లేదా మూడు ల‌క్ష‌లు వ‌స్తాయి. దాంట్లో బాధితుల‌కు 20 లేదా 25 వేలు ఇచ్చే వాళ్లని పోలీసుల విచారణలో తెలిసింది. ముంబైలోని వెస్ట్ మ‌లాడ్‌లో ఉన్న మాద్ ఏరియా బిల్డింగ్‌లో షూటింగ్ చేసేవాళ్లు. అక్క‌డ పోలీసులు చేసిన త‌నిఖీల్లో ఐదుగురు దొరికారు.

పోర్న్ ఫిల్మ్స్ షూటింగ్ కేసులో.. సీ గ్రేడ్ డైర‌క్ట‌ర్‌ తన్వీర్ హష్మీని పోలీసులు సూరత్ లో అరెస్టు చేశారు. అతడు ఇప్ప‌టివ‌ర‌కు 8 అశ్లీల చిత్రాల‌ను డైర‌క్ట్ చేశాడు. సినిమాల్లో ఛాన్స్ పేరుతో ఔత్సాహిక హీరోయిన్ల‌ను పోర్న్ చిత్రాల వైపు మ‌ళ్లించేవాడు. రాజ్ కుంద్రా చైర్మన్ గా ఉన్న వియాన్ ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ గా పని చేసే ఉమేశ్ కామ‌త్ ద్వారా ఆ వీడియోల‌ను బ్రిట‌న్‌లోని కెర్నిన్ లిమిటెడ్ కంపెనీకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసేవాడు.

విదేశీ ఐపీ అడ్ర‌స్‌ల ద్వారా పోర్న్ వీడియోల‌ను అప్‌లోడ్ చేసేవాళ్లని పోలీసుల విచారణలో తెలిసింది. హాట్‌షాట్‌, న్యూఫ్లిక్స్‌, హాట్‌హిట్‌, ఎస్కేప్‌నౌ.టీవీ లాంటి అప్లికేష‌న్స్‌ను వాడేవారని చెప్పారు. పోర్న్ వీడియోలు షూట్ చేసేందుకు వాడిన సుమారు 6 ల‌క్ష‌ల విలువైన‌ ప‌రిక‌రాల‌ను పోలీసులు సీజ్ చేశారు.

కాగా ఈ కేసులో విచారణ నిమిత్తం రాజ్ కుంద్రాను పోలీసులు కస్టడీకి కోరనున్నారు. రాత్రంతా లాకప్ లోనే ఉన్నారు. తెల్లవారుజామున జేజే ఆసుపత్రిలో రాజ్ కుంద్రా కు వైద్యపరీక్షలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, అశ్లీల వీడియోల కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌కుంద్రా ఉన్నాడని ముంబై పోలీస్‌ కమిషనర్ తెలిపారు. కాగా, తాను ఏ తప్పు చేయలేదని రాజ్‌కుంద్రా అంటున్నారు. ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జేఎల్‌ స్ట్రీమ్‌ యాప్‌, ఐపీఎల్ క్రికెట్‌ టీం రాజస్థాన్‌ రాయల్స్‌కు యజమానిగా ఉన్నారు. 2013లో ఐపీఎల్‌ బెట్టింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో రాజ్‌ కుంద్రాను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.