Rajadhani Train: భారీ సిమెంట్ పిల్లర్ ను ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్

ముంబై నుంచి హజ్రత్ నిజాముద్దీన్(ఢిల్లీ)కి వెళ్తున్నఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్.. గుజరాత్ లోని వల్సాడ్ సమీపంలో.. పట్టాలపై ఉన్న సిమెంట్ పిల్లర్ ను ఢీకొట్టింది

Rajadhani Train: భారీ సిమెంట్ పిల్లర్ ను ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్

Trainq

Rajadhani Train: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. పట్టాలపై అడ్డుగా ఉన్న భారీ సిమెంట్ పిల్లర్ ను రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొట్టిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వల్సాడ్ వద్ద చోటుచేసుకుంది. శనివారం గుజరాత్ పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. ముంబై నుంచి హజ్రత్ నిజాముద్దీన్(ఢిల్లీ)కి వెళ్తున్నఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్.. గుజరాత్ లోని వల్సాడ్ సమీపంలో.. పట్టాలపై ఉన్న సిమెంట్ పిల్లర్ ను ఢీకొట్టింది. వల్సాడ్ లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ధాటికి పిల్లర్ ముక్కలుగా ఎగిరిపడింది. ఈఘటనలో రైలుకు ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. సిమెంట్ పిల్లర్ ను ఢీకొన్న ఘటనపై రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే అధికారులు ఘటన స్థలికి చేరుకున్నారు.

Also Read: BrahMos missiles: ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులు, అదే బాటలో అరబ్ దేశాలు

ఎవరో కొందరు ఆకతాయిలు రైలుని పట్టాలు తప్పించేందుకు ఈ పిల్లర్ ను అడ్డుగా పెట్టి ఉంటారని వల్సాడ్ రూరల్ పోలీసులు తెలిపారు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. సిమెంట్ పిల్లర్ ను పట్టాల వరకు ఎలా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఘటనలో ఎటువంటి ఆస్థి ప్రాణ నష్టం వాటిల్లలేదని రైల్వేశాఖ ప్రకటించింది.

Also read: UP Elections: గోరఖ్‌పూర్ నుంచి యోగిని బరిలో దించడంపై బీజేపీ మాస్టర్ ప్లాన్