Odisha Train Accident : కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ఏలూరు, రాజమండ్రి వాసులు క్షేమం

ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రపదేశ్ వాసులు ప్రయాణిస్తున్నారు. వీరి క్షేమంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో పలువరు క్షేమంగానే ఉన్నారని కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం అందింది.

Odisha Train Accident : కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ఏలూరు, రాజమండ్రి వాసులు క్షేమం

Odisha Coromandel Train Incident

Odisha Train Accident : ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధప్రదేశ్ కు చెందిన ప్రయాణీకులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో తమవారు ప్రాణాలతోనే ఉన్నారా? లేదా?అనే ఆందోళనలో వారు కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించేవారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఎపీకి రావాల్సిన ప్రయాణికులు 48 మంది ఉన్నారని..రైలు ఎక్కిన వారిలో 48 మందిలో 32 మంది పురుషులు, 16మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వీరిలో ఏలూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం వాసులు ఉన్నారు.

వీరిలో ఇద్దరు ఏలూరు వాసులు క్షేమంగానే ఉన్నారని తెలిసింది. శ్రీకర్ బాబు, బంగారం షాపులో పనిచేసే గోరాపాల్ చంద్ అనే వ్యక్తి ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. వీరు ఒడిశా నుంచి ఏలూరుకు వస్తున్న క్రమంలో రైలు బాలాసోర్ జిల్లాలో ప్రమాదానికి గురి అయ్యింది. దీంతో తమవారు ఎలా ఉన్నారనే ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లో నెలకొన్న క్రమంలో ఏలూరుకు చెందిన శ్రీకర్ బాబు,గోరాపాల్ చంద్ క్షేమంగానే ఉన్నారని తెలిసి వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. వీరిద్దరు కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. గోపాల్ చంద్ ఆస్పత్రిలో చికిత్స పొంతున్నారు.శ్రీకర్ బాబు మాత్రం రోడ్డుమార్గంలో ఏలూరుకు బయలుదేరారు. ఆయన సాయంత్రానికి ఏలూరు చేరుకోనున్నారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం ఒక మిస్టరీ.. NFIR ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు

అలాగే ఇదే రైలులో ప్రయాణించే 20 మంది రాజమండ్రి వాసులు కూడా క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. రాజమండ్రికి చెందిన 24మంది కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో షాలిమార్ నుంచి రాజమండ్రి రావటానికి రిజర్వేషన్ చేయించుకున్నారు. వీరిలో 23మంది రైలు ఎక్కినట్లుగా తెలుస్తోంది. ఒకరు మాత్రం రైలు ఎక్కలేదు.  కానీ మిగిలిన 23మందిలో ఇద్దరికి వెయిటింగ్ లిస్టులో ఉండటంతో వారు రైలు ఎక్కారా?లేదా అనే అనుమానాలు ఉన్నాయి.  ఈప్రమాదంలో 20 సురక్షితంగా ఉన్నారని హెల్ప్ డెస్క్ కు సమాచారం అందింది.

24మందిలో 20మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. కానీ మరో ముగ్గురిలో ఒకరు రైలు ఎక్కలేదు. ఇకపోతే ఇద్దరికి వెయిటింగ్ లిస్టు రావటంతో వారు రైలు ఎక్కారా?లేదా? ఎక్కితే వారు ఏమయ్యారు? ప్రాణాలతోనే ఉన్నారా? గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ రైలు ప్రమాదంలో రాజమండ్రికి చెందిన 20మంది గాయాలతో బయటపడి ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లుగా తెలియటంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి తీసుకున్నారు. మిగిలినవారి పరిస్థితిపై సమాచారం అందాల్సి ఉంది.