Amazing Construction : థార్ ఎడారిలో కూల్ స్కూల్ బిల్డింగ్..ఆకట్టుకునే అద్భుతమైన నిర్మాణం

థార్ ఎడారిలో అద్భుతమైన స్కూల్ భవనం..కళ్లు తిప్పుకోలేని అందంగా ఉంటుందీ స్కూల్. ఎడారిలోఉన్నా..కూల్ కూల్ గా ఉండటంతో ఈ స్కూల్ బిల్డింగ్ మరో స్పెషాలిటీ.

Amazing Construction : థార్ ఎడారిలో కూల్ స్కూల్ బిల్డింగ్..ఆకట్టుకునే అద్భుతమైన నిర్మాణం

Super School Building School (1)

Super school building in the Thar Desert : కాసేపు ఎండలో ఉంటే చాలు ఓరి నాయనో ఇదేం ఎండరా బాబూ చంపేస్తోంది అంటాం. హైదరాబాద్,ఢిల్లీ నగరాల్లో ఎండాకాలం వచ్చిందంటే వేడి సెగలే సెగలు.అటువంటిది రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారిలో వేసవి ఎలా ఉంటుంది? శరీరం బొబ్బలెక్కిపోతుంది కదూ. ఆ పరిస్థితి తలచుకుంటునే చెమటలుకారిపోవటమే కాదు ఒళ్లంతా సెగలు రేగినట్లుగా ఫీల్ అవుతాం. థార్ ఎడారిలో నిప్పులు కక్కే ఎడారి మధ్యలో చిన్నపిల్లల కోసం స్కూల్ ఉంది. ఈ స్కూల్ నిర్మాణం చూస్తే ఔరా..ఏమి ఈ ప్లాన్ అని కచ్చితంగా ఆశ్చర్యపోతాం. అందానికి అందం…వినూత్నకు ఏమాత్రం తగ్గన ఈ స్కూల్ భవనం నిర్మాణం నభూతో నభవిష్యత్ అనిపిస్తుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఈ స్కూల్ మండిపోయే థార్ ఎడారిలో నిర్మించటం మరో విశేషం. కానీ ఆ స్కూల్ భవనం లోపలికి వెళ్తే మాత్రం చాలా కూల్‌ కూల్ గా ఉంటుందట. ఏసీలతో పనే ఉండదట.

ఈ స్కూల్ భవనాన్ని చూస్తే థార్ ఎడారి మధ్యలో వికసించిన ఎడారి పువ్వు అనిపిస్తుంది. జై సల్మేర్ శామ్‌డ్యూన్స్‌లో ఉండే కనోయ్ గ్రామ సమీపాన థార్ అగ్నిగుండంలో పుట్టిన శీతల పుష్పం. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పక తప్పదు. మహాభారతంలో మయసభను నిర్మించిన విశ్వకర్మ రాత్రికి రాత్రే ఈ భవనాన్ని నిర్మించాడా?అనిపిస్తుంది. దగ్గరికి వచ్చి చూస్తే కార్పొరేట్ ఆఫీసుకు ఏమాత్రం తగ్గదనిపిస్తుంది. ఈ భవన సముదాయంలో ప్రతీ బిల్డింగ్‌ కంటే ఇది భిన్నంగా ఉంటుంది. చూపుతిప్పుకోనివ్వని ప్రత్యేకత ఈ స్కూల్ ఎన్నో ప్రత్యేకలు ఈ భవతు సొంతం. ఎప్పుడూ 50డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే థార్ ఎడారిలో నిర్మించిన స్కూల్ ఇది. పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాల బాలికలకోసం అక్షరాలు నేర్పించేందుకు… తల్లులకు జీవనోపాధి విద్యలు నేర్పేందుకు నిర్మించిన పాఠశాల ఇది. శాండ్ స్టోన్‌తో ఈ భవనం తయారైంది. ఈ భవనం గుండ్రంగా కాకుండా అండాకారంలో ఉంటుంది. గాలి వెలుతురు సమృద్ధిగా ప్రసరించేందుకు ఏర్పాట్లున్నాయి. ఎడారి మధ్యలో ఉన్నా చల్లగా హాయిగా ఉండటం ఈ బిల్డింగ్ ప్రత్యేకత.

ఇంత అందమైన వినూత్న నిర్మాణంలో ఉన్న ఈ స్కూల్ పేరు రాజకుమారి రత్నావతి బాలికల పాఠశాల. భవనం మీద ఏర్పాటు చేసిన సోలార్ పానెల్స్, భవనం చుట్టూ ఏర్పాటు చేసిన మెష్ గోడలు ఎసి వాతావరణాన్ని కలిగిస్తాయ్. ఈ రెండింటితో స్కూల్లోని తరగతి గదులు చల్లగా ఉంటాయ్. పిల్లలు ఎండను లెక్క చేయకుండా ఆడుకోవచ్చు. ఈ కాంప్లెక్స్ లో మొత్తం మూడు భవనాలున్నాయి. మొత్తం 4వందల మంది విద్యార్థులు చదువుకునేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. స్కూలు కాంప్లెక్స్‌లో ఒక మ్యూజియం, రెండు ప్రదర్శన శాలలు ఉన్నాయ్. ఇక్కడ చదువుకునే బాలికల తల్లుల జీవనోపాధి కల్పన కోసం.. చేనేత, అల్లికలు, రంగులు అద్దడంలాంటి వృత్తులలో శిక్షణ ఇస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక భవనం కేటాయించారు.

ఇందులోనే ఒక లైబ్రరీ, ఆడియో విజువల్ లెక్చర్ హాల్ కూడా ఉన్నాయ్. అమెరికా న్యూయార్క్‌లో రిజిస్టర్ అయిన సిట్టా అనే సంస్థ ఈ స్కూల్ స్థాపించింది. అమెరికాకు చెందిన డయానా కెల్లాగ్ ఈ భవనం డిజైన్ రూపొందించారు. ఇక్కడి విద్యార్థుల యూనిఫాం… ప్రఖ్యాత భారతీయ ఫాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు. జైసల్మీర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మన్వేందర్ సింగ్.. ఈ స్కూల్ కోసం 22 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు. ఐతే ఈ స్కూల్‌ను రెండేళ్ల కిందే ప్రారంభించాలని అనుకున్నా.. కరోనా కారణాలతో వాయిదా పడింది. ఎండలు మండే ఎడారిలో.. చల్లగా అనిపించే.. అద్భుతంలా కనిపించే ఈ స్కూల్ బిల్డింగ్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ ఈ ఎడారి పుష్పం వైపు.