Six sisters Marriage : ఆరుగురు కూతుళ్లకు ఒకేసారి పెళ్లి చేసి..గుర్రాలపై ఊరేగించిన బస్ డ్రైవర్

ఒక్క ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ఎంతో కష్టపడాలి. అటువంటిది ఓ సాధారణ బస్ డ్రైవర్ ఒకేసారి ఆరుగురు కూతుళ్లకు పెళ్లి చేసి భావోద్వేగానికి గురైన అరుదైన ఘటన రాజస్థాన్ లో జరిగింది.

Six sisters Marriage : ఆరుగురు కూతుళ్లకు ఒకేసారి పెళ్లి చేసి..గుర్రాలపై ఊరేగించిన బస్ డ్రైవర్

School Bus Driver Who Married Six Sisters At One Time

School bus driver who married six sisters at one time : ఒక్క ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తండ్రి ఎన్ని ఆలోచిస్తాడో. మంచి సంబంధం చూడాలి. ఘనంగా పెళ్లి చేయాలి. చీరా,సారె పెట్టి ఆనందంగా పంపించాలి. ఇన్ని చేయాలంటే ఆ తండ్రి ఎంత కష్టపడాలి. కానీ ఓ తండ్రి మాత్రం తన ఆరుగురు కూతుళ్లకు ఒకేసారి పెళ్లి చేశాడు. అతను ఏదో శ్రీమంతుడు అనుకుంటే పొరపాటే. ఓ డ్రైవర్. స్కూల్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కానీ తనకున్న ఏడుగురు కూతుళ్లలో ఒకేసారి ఆరుగురు కూతుళ్లకు ఒకేసారి పెళ్లి చేసి వారిని గుర్రాలపై ఊరేగించి పెళ్లి బారాత్ లో ఆందంగా డ్యాన్స్ లు వేస్తు తీవ్ర భావోద్వేగానికి గురైన ఓ తండ్రి ఆనందాల హరివిల్లుకు రాజస్థాన రాష్ట్రం వేదికైంది. ఏకంగా ఒకేసారి ఆరుగురు కూతుళ్లకు పెళ్లి చేసిన ఆ డ్రైవర్ అందరినీ ఆకర్షించాడు. ఈ వివాహఆలు రాజస్థాన్‌లోనే కాకుండా దేశమంతటా చర్చనీయాంశమైంది.

Read more : ఒకే వేదికపై, ఒకే ముహుర్తానికి తల్లీ కూతుళ్ల….పెళ్లిళ్లు

రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా ఖేతడిలో రోహితాక్షన్‌ అనే వ్యక్తి స్కూల్‌ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో పెళ్లీడు వచ్చిన ఆరుగురు కుమార్తెలకు వివాహం చేయాలి. అందరు ఆనందంగా ఉండాలి అని అందరు తండ్రుల్లాగా ఆశపడ్డాడు. అలా ఆరుగురు కుమార్తెలకు ఇద్దరేసి చొప్పున అన్నదమ్ములు ఉన్న కుటుంబాలతో సంబంధాలు కుదిర్చాడు.

పెద్దకుమార్తె మీనా దుక్కేరా, మూడో కుమార్తె సీమాల వివాహం హర్యానాకు చెందిన నరేశ్‌, భైరూ సింగ్‌తో జరిగింది. రెండో కుమార్తె అంజు, నాలుగో కుమార్తె నిక్కీలు నీమ్‌ ఖాఠానాకు చెందిన ధర్మవీర్‌, విజయేంద్రలను వివాహం చేసుకున్నారు. యోగిత,సంగీతల వివాహం ఖుదానియాకు చెందిన ప్రదీప్‌, మోహిత్‌లతో జరిగింది.

Read more : సీఎం కన్యాదాన్ పథకం : ఒకేసారి 1330 వివాహాలు

ఈ ఆరుగురు కూతుళ్లకు డ్రైవర్‌ రోహితాక్షన్‌ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. పెళ్లి బారాత్‌లో వధూవరులకు పసుపు దుస్తులు ధరించి డీజేలో కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి కూతుళ్లు వేసిన స్టెప్పులు అందరిని కట్టిపడేశాయి. తండ్రి కూడా కూతుళ్ల బారాత్ లో ఆనందంగా చిందులేశాడు. ఖేతడి గ్రామంలో అందరూ వివాహానికి హాజరయ్యారు. పెళ్లి కూతుళ్లను గుర్రాలపై ఊరేగించారు. ఆరుగురు కూతుళ్ల వివాహంతో తండ్రి రోహితాక్షన్‌ ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. వివాహాలు పూర్తయ్యాక భావోద్వేగానికి లోనయ్యారు.నా కూతుళ్లంతా సంతోషంగా ఉండాలని దీవించు స్వామీ అంటూ భగవంతుడిని కన్నీటితో ప్రార్థించాడు.