దేవుడు చెప్పాడంట : మట్టి ఇళ్లల్లోనే ఆ గ్రామ ప్రజలు నివసిస్తున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : January 30, 2019 / 10:06 AM IST
దేవుడు చెప్పాడంట : మట్టి ఇళ్లల్లోనే ఆ గ్రామ ప్రజలు నివసిస్తున్నారు

రాజస్థాన్ లో ఓ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. దేవుడు చెప్పాడంటూ మట్టి ఇళ్లల్లోనే అక్కడి ప్రజలు నివసిస్తున్నారు. ఒక్క పంచాయితీ ఆఫీస్, ఓ ఆలయం తప్ప ఆ ఊరిలో మరెక్కడా కాంక్రీట్ పునాది కన్పించదు. చదువుకున్నవాళ్లైనా సరే ఆచారాన్ని పాటిచాల్సిందే.ఈ గ్రామం గురించి విన్న ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు.

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దగ్గర్లో ఎత్తైన కొండలు, పచ్చిక భూముల మధ్య దేవమాలి గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఎటుచూసినా మట్టి ఇళ్లే కన్పిస్తాయి. ఈ ఊరిలో గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన 200 కుటుంబాలున్నాయి. పాడి, పంటలే ఇక్కడి ప్రజలకు ప్రధాన జీవనాధారం. గ్రామం చివర్లో కొండపై దేవనారాయణుడు స్వామి ఆలయం ఉంది. గ్రామ ప్రజలందరూ కొలిచే దేవనారాయణుడి శతాబ్ధాల క్రితం తమ పూర్వీకులను పక్కా ఇళ్లు కట్టుకోవద్దని, కేవలం మట్టి ఇళ్లల్లో మాత్రమే నివసించాలని  సూచించడంతో తామంతా ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పక్కా ఇళ్లు నిర్మించుకుంటే దేవుడు ఆగ్రహానికి గురి కాక తప్పదని తెలిపారు. మట్టి ఇళ్లలో స్వచ్ఛత ఉంటుందని, ఇళ్లను ఆవు పేడతో అలుకుతామని, అది దైవంలానే స్వచ్ఛమైనదని గ్రామ మాజీ సర్పంచ్ మాధవ్ రామ్ తెలిపారు.