2 Doses Vaccination : రెండు డోసులు ఒకేసారి వేసేరంటూ మహిళ ఆందోళన..డోంట్ వర్రీ అంటున్న వైద్య సిబ్బంది

2 Doses Vaccination : రెండు డోసులు ఒకేసారి వేసేరంటూ మహిళ ఆందోళన..డోంట్ వర్రీ అంటున్న వైద్య సిబ్బంది

Two Doses Vaccine

Women 2 Doses Vaccination: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్న ఘటనలువెలుగు చూస్తున్నాయి. కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రెండు డోసులు ఒకేసారి ఇవ్వటం..లేదా మొదటి డోసులో కోవాగ్జిన్ ఇచ్చినవారికి రెండోడోసు కోవీషీల్డ్ ఇవ్వటం జరుగుతున్నాయి. కానీ ఇలా జరిగినా ప్రమాదమేమీ లేకపోవటం కాస్త ఊరట కలిగించే విషమని చెప్పాలి. ఈక్రమంలో రాజస్థాన్ లో ఓ మహిళ వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెళ్లగా వారు ఒకేసారి తనకు రెండు డోసులు చేసేశారని భయాందోళనలు వ్యక్తంచేసింది. కానీ అదేమీ కాదని వైద్య సిబ్బంది అంటున్నారు.

దౌసాలో 44 ఏళ్ల మహిళ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి..వ్యాక్సిన్ వేయించుకుంది. ఆ తరువాత మామూలుగా ఇంటికి వెళ్లిపోయింది. ఈక్రమంలో సాధారణంగా చాలామందికి వచ్చినట్లుగానే ఆమెకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చింది. దీంతో కంగారుపడిపోయింది. నాకు రెండు డోసులు ఒకేసారి చేసేశారు అంటూ భర్త చరణ్ శర్మకు చెప్పింది. భార్య పరిస్థితిపై కంగారు పడిన భర్త వ్యాక్సిన్ వేసిన కేంద్రానికి వెళ్లి ఆరాతీశాడు.వైద్య సిబ్బందిని నిలదీశాడు. కానీ ఆ విషయాన్ని ఇవి కేవలం మీ ఆరోపణలు మాత్రమే..నిజంగాకాదు మేం ఒక్క డోసే వేశాం..అంటూ కొట్టిపారేశారు.

ఈ విషయంపై దౌసా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనీష్ చౌదరి మాట్లాడుతూ..ఆమెకు వ్యాక్సిన్ వేయటానికి భుజం మీద ఇంజెక్ట్ చేయటానికి రక్తం వచ్చిందనీ…అందుకే మరో వైపు భుజానికి వేశామని అంతేతప్ప రెండు డోసులు చేయలేదని స్పష్టం చేశారు. అంతేతప్ప ఆమెకు రెండు డోసులు ఇవ్వలేదని తెలిపారు.అది ఆమె భ్రమ మాత్రమేనని ఒకవైపు బ్లడ్ రావటంతో రెండో వైపు చేశామని ఈక్రమంలో ఆమె రెండు డోసులు ఇచ్చారని భావిస్తోందని తెలిపారు.

కానీ ఒకేసారి రెండు డోసులు వేసినా..ప్రమామేమీ లేదని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే.పొరపాటున రెండు డోసులు వేసినా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు.