Ashok Gehlot : లంచాల గురించి ఉపాధ్యాయులను ప్రశ్నించిన సీఎంకి షాకింగ్ రిప్లై

ఉపాధ్యాయులతో నిర్వహించిన కార్యక్రమంలో రాజస్తాన్ సీఎంకి చుక్కెదురైంది. బదిలీల్లో మరియు కొత్త పోస్ట్ ల కోసం లంచాలు ఏమైనా అడుగుతున్నారా అని ప్రశ్నించిన సీఎం అశోక్ గెహ్లాట్

Ashok Gehlot : లంచాల గురించి ఉపాధ్యాయులను ప్రశ్నించిన సీఎంకి షాకింగ్ రిప్లై

Gehlot

Ashok Gehlot :  ఉపాధ్యాయులతో నిర్వహించిన కార్యక్రమంలో రాజస్తాన్ సీఎంకి చుక్కెదురైంది. బదిలీల్లో మరియు కొత్త పోస్ట్ ల కోసం లంచాలు ఏమైనా అడుగుతున్నారా అని ప్రశ్నించిన సీఎం అశోక్ గెహ్లాట్ కి ఉపాధ్యాయులంతా కలిసి ‘అవును’ అని ముక్తకంఠంతో సమాధానం చెప్పారు. దీంతో తన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి విని షాక్ అవ్వడం సీఎం వంతైంది.

మంగళవారం జైపూర్‌లో ‘రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజస్తాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ దొతాస్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్య, పాఠశాల స్థాయిలో అద్భుతంగా పనిచేసిన 111 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం సీఎం గెహ్లాట్ వేదికపై నుంచి ప్రసంగిస్తూ ఉపాధ్యాయుల కోసం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ‘‘ఉద్యోగాల బదిలీలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా?’’ అని సీఎం ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రశ్నించారు.

సీఎం ఈ ప్రశ్న అడిగిన వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు ఒక్కసారిగా ‘‘అవును.. ఇవ్వాల్సి వస్తోంది’’ అంటూ సమాధానమిచ్చారు. బదిలీలు మరియు కొత్త పోస్ట్ ల కోసం స్థానిక ఎమ్మెల్యేలతో లాబీయింగ్ చేయాల్సి వస్తోందని,లంచం చెల్లించవలసి ఉంటుందని ఉపాధ్యాయుల నుంచి వచ్చిన సమాధానం విన్న సీఎం నోట కొద్ది క్షణాలు మాట రాలేదు. వెంటనే తేరుకుని టీచర్ల ఫిర్యాదును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫర్ కోసం టీచర్లు డబ్బులు చెల్లంచడం చాలా దురదృష్టకరమని సీఎం అన్నారు. దీని కోసం ఓ పాలసీతీసుకురావాల్సిన అవసరముందని గెహ్లాట్ అన్నారు.

ALSO READ Dead Body : ఘోరం.. యువతిని వివస్త్రను చేసి, జననాంగాన్ని కాల్చేసి..