Ashok Gehlot : కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా .. సీఎంగానూ కొనసాగుతానంటున్న అశోక్ గెహ్లాట్ ..

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా .. సీఎంగానూ కొనసాగుతానంటున్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. కానీ షరతులు వర్తిస్తాయంటోంది కాంగ్రెస్ పార్టీ. మరి సోనియా ఏమంటారు? గెహ్లాట్ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? లేదా?అనేది ఆసక్తిగా మారింది.

Ashok Gehlot : కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనా .. సీఎంగానూ కొనసాగుతానంటున్న అశోక్ గెహ్లాట్ ..

rajasthan cm ashok gehlot likely congress president

Ashok Gehlot : కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు అవుతారు? దేశ వ్యాప్తంగా ఓటమిపాలు అవుతున్న కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే నేత ఎవరు? అనేదానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి ఎన్నికల జరుగనున్న క్రమంలో ఈ పదవి పోటీలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. సోనియాగాంధీ కూడా గెహ్లాట్ అధ్యక్షుడిగా ఉండాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియాగాంధీతో గెహ్లాట్ భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి గెహ్లాట్ ఎన్నికైతే రాజస్థాన్ సీఎంపదవి నుంచి గెహ్లాట్ ను తప్పించాలని కాంగ్రెస్ చూస్తోంది. ఆయన స్థానంలో సీఎంగా సచిన్ పైలెట్ కు నియమించాలని యోచిస్తోంది. కానీ ఓ పక్క సీఎంగా కొనసాగుతూనే మరోపక్క అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని..పోటీలో ఎన్నికైనా..సీఎంగా కొనసాగుతానని చెబుతున్నారు గెహ్లాట్. అదే విషయాన్ని సోనియాగాంధీతో చర్చించనున్నారు ఆయన. మరి కాంగ్రెస్ రథసారధిగా ఎవరు ఎన్నికవుతారు? అనేదానిపై ఆసక్తి కొనసాగుతోంది.

100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు ఇప్పుడు గడ్డుకాలం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై రాహుల్ గాంధీ మొగ్గు చూపించకపోవటంతో కాంగ్రెస్ పార్టీకి రెండు పుష్కరాల తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్షపదవిలో గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో అటు, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్ పోటీకి సై అంటున్నారు. మరోవైపు, సోనియా గాంధీతో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అధ‌్యక్ష ఎన్నికల్లో పోటీ కోసమే ఆయన భేటీ అయ్యారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో తాను ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటానని ఎక్కువమంది పోటీ చేయడాన్ని ఆహ్వానిస్తానని సోనియా చెప్పినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. రాజస్థాన్‌‌లో బీజేపీ ఆపరేషన్ లోటస్, సచిన్ పైలట్ తిరుగుబాటుతో సహా అనేక ముప్పులను ఎదుర్కొన్న అనుభవజ్ఞుడు అశోక్ గెహ్లాట్. అందుకే పార్టీ బాధ్యతలను చేపట్టవలసిందిగా సోనియా గాంధీ పదేపదే ఆయనను కోరుతున్నట్లుగా తెలుస్తోంది.

గెహ్లాట్ అధ్యక్షుడిగా ఎన్నిక అయితే సీఎం పదవినుంచి ఆయనను తప్పించి సచిన్ పైలట్‌కు అప్పగించే అవకాశం ఉంది. కానీ గెహ్లాట్ మాత్రం తాను సీఎంగా కొనసాగుతూనే మరోవైపు అధ్యక్షుడిగా ఉండే యోచనలో ఉన్నారు. అదే విషయాన్ని సోనియాతో చర్చించేందుకు భేటీ కానున్నారు. మరోవైపు, చాలా సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవి కోసం సచిన్ పైలట్ ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ఏడాదే సమయం ఉన్నందున గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడైతే తనకు అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.

సచిన్ పైలట్ అధిష్ఠానం దగ్గర తన డిమాండ్ బలంగా వినిపించినప్పుడల్లా గెహ్లాట్ ఇంకా పట్టుబడుతున్నారు. తన స్థానంలో వచ్చిన వ్యక్తి తన విధేయుడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి రెండు పాత్రలను కొనసాగించాలని గెహ్లాట్ ఆశపడుతున్నారు. మరో వర్గం మాత్రం సచిన్ పైలట్‌కు సీఎంగా ఎన్నికల ముందు అవకాశం లభిస్తుందని అంటోంది. కాగా..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల కానుండగా.. 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19న కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు.