బీజేపీ కుట్రలు సాగనివ్వం, ప్రధాని ఇంటి వద్ద నిరసన చేస్తాం… అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

  • Published By: bheemraj ,Published On : July 25, 2020 / 10:07 PM IST
బీజేపీ కుట్రలు సాగనివ్వం, ప్రధాని ఇంటి వద్ద నిరసన చేస్తాం… అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డార. రాష్ట్రంలో బీజేపీ కుట్రలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. శనివారం (జులై 25, 2020) జైపూర్ లో సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తామన్నారు. రాజస్థాన్ రాష్ట్ర పరిస్థితులను రాష్ట్రపతికి వివరిస్తామని ఎమ్మెల్యేలతో చెప్పారు. అంతేకాదు ప్రధాని ఇంటి వద్ద నిరసన ప్రదర్శనలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలంతా ఐక్యమత్యంగా ఉండాలని గెహ్లాట్ పిలుపునిచ్చారు.

రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతదూరం వెళ్లేందుకుకైనా తాను సిద్ధమని అన్నారు. అవరసమైతే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్ కోవింద్ ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు, బీజేపీ ఏ విధంగా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్న అంశాలను రాష్ట్రపతికి వివరించాలని అలాగే ప్రధాని మోడీ నివాసం ముందు ధర్నా చే్ద్దామని ఎమ్మెల్యేలకు సూచించారు.

సీఎం అశోక్ గెహ్లాట్ ఏ సమయంలోనైనా గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. సోమవారం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని గవర్నర్ కు మరోసారి విన్నవించనున్నారు. అసెంబ్లీలో అశోక్ గెహ్లాట్ విశ్వాస పరీక్ష నిర్వహించడం ద్వారా ప్రత్యర్థులకు గట్టి బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. సీఎంకు మద్దుతుగా 100 మంది ఎమ్మెల్యేలు రాజ్ భవన్ వద్ద 5 గంటలపాటు ధర్నా చేపట్టారు.

సచిన్ పైలెట్ వర్గం బయటికి వెళ్లిన తర్వాత కావాల్సిన సంఖ్యా బలం తనకు ఉందని గెహ్లాట్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలను సమావేశపర్చాలని గవర్నర్ కు లేఖ రాశారు. అయితే గవర్నర్ అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడంతో నిన్న ఐదు గంటలపాటు ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

అయితే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా కేబినెట్ సిఫార్సు తనకు పంపించినట్లైతే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పడంతో ఈరోజు కేబినెట్ సమావేశాన్ని సైతం నిర్వహించి ఆరు అంశాలకు సంబంధించి కొన్ని తీర్మానాలు చేసి ఒక నోట్ ను రూపొందించారు. బల పరీక్ష, కరోనా సహా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.

బీజేపీకి సంబంధించిన నేతలు గవర్నర్ ను కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్..బీజేపీ బృందంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి, కరోనా పరిస్థితులు సహా రాజకీయ పరిస్థితులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో రాజకీయ హీట్ పెరుగుతోంది. గవర్నర్ నిర్ణయం తీసుకోకపోయినట్లైతే కచ్చితంగా సోమవారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలన్న యోచనలో కూడా అశోక్ గెహ్లాట్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది.