Rajasthan: పోయిన ఏడాది బడ్జెట్ చదివిన అశోక్ గెహ్లాట్.. 7 నిమిషాల తర్వాత కాంగ్రెస్ నేత చెప్తే కానీ పసిగట్టని రాజస్థాన్ సీఎం

ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రతులు చుదువుతూ 2022-23 బడ్జెట్‭లోని రెండు ప్రకటనలు చేయగానే ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. సభ వెల్‌లోకి దూసుకుపోయి హంగామా చేశారు విపక్ష నేతలు. స్పీకర్ సి.పి. జోషి జోక్యం చేసుకుని ఆర్డర్‌ను కొనసాగించాలని కోరినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో సభ అరగంట పాటు వాయిదా పడింది.

Rajasthan: పోయిన ఏడాది బడ్జెట్ చదివిన అశోక్ గెహ్లాట్.. 7 నిమిషాల తర్వాత కాంగ్రెస్ నేత చెప్తే కానీ పసిగట్టని రాజస్థాన్ సీఎం

Rajasthan CM reads out excerpts of previous budget

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో ఈరోజు (10 ఫిబ్రవరి) రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ఏడాది బడ్జెట్ (2023-24) కాకుండా పోయిన సంవత్సరం బడ్జెట్ (2022-23) పేపర్లు చదివారు గెహ్లాట్. ఇలా 7 నిమిషాల పాటు పాత బడ్జెట్ పేపర్లు చదివారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత, వెనకాల నుంచి గెహ్లాట్ భుజం తట్టి ‘పోయిన ఏడాది బడ్జెట్ అది’ అని చెప్పే వరకు గెహ్లాట్ పసిగట్టలేదు.

ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రతులు చుదువుతూ 2022-23 బడ్జెట్‭లోని రెండు ప్రకటనలు చేయగానే ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. సభ వెల్‌లోకి దూసుకుపోయి హంగామా చేశారు విపక్ష నేతలు. స్పీకర్ సి.పి. జోషి జోక్యం చేసుకుని ఆర్డర్‌ను కొనసాగించాలని కోరినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో సభ అరగంట పాటు వాయిదా పడింది.

వాయిదా అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లో బైఠాయించి ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. తప్పుగా చదివినందుకు గెహ్లాట్ క్షమాపణ చెప్పి ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేసినప్పటికీ విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

గెహ్లాట్ చేసిన ఈ ఘనకార్యంపై నెటిజెన్లు బాగానే సెటైర్లు వేస్తున్నారు. ఇక విపక్ష పార్టీల విమర్శలు గట్టిగానే పడుతున్నాయి.