రాజస్థాన్ లో ఏవియన్ ఫ్లూ, భారీ సంఖ్యలో చనిపోతున్న కాకులు

రాజస్థాన్ లో ఏవియన్ ఫ్లూ, భారీ సంఖ్యలో చనిపోతున్న కాకులు

Rajasthan crows die due to avian flu : భారతదేశంలో కొత్త కొత్త రకాల వైరస్ లు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకముందే..కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కలవర పెడుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో భారీగా కాకులు చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా ఇంత పెద్ద సంఖ్యలో కాకులు ఎందుకు చనిపోతున్నాయనే దానిపై అధికారులు దృష్టి పెట్టారు. కాకుల శాంపిళ్లను సేకరించి పరిశోధించారు. దీనికి ఏవియన్ ఫ్లూ కారణమని తేల్చారు. ఈ వైరస్ కారణంగా..కాకులు చనిపోతున్నాయని నిర్ధారించారు.

ఇది పక్షుల నుంచి పక్షులకు వ్యాపించే వ్యాధి అని తేల్చారు. దీంతో ఝులావర్ జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా…శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఇందుకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేసింది. స్థానికంగా ఉండే..పౌల్ట్రీ ఫామ్స్, పౌల్ట్రీ దుకాణాల నుంచి కూడా శాంపిల్స్ ను సేకరిస్తోంది. తాత్కాలికంగా పౌల్ట్రీలను మూసివేయాలని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. Radi ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. Avian influenza ను ఏవియన్ ఫ్లూ లేదా..బర్డ్ ఫ్లూ అని పిలుస్తారు. అకస్మిక మరణం, నాడీ లక్షణాలు, శ్వాసకోశ లక్షణాలు, శ్వాస కోశ లక్షణాలు, విరేచనాలు, ఇతరత్రా కారణాలు ఉంటాయి.