నగ్నంగా ఉండి కాల్ చేస్తారు.. ఇటువైపు వ్యక్తిని అలాగే చూడాలని ఉందని చెప్పి స్క్రీన్ షాట్లు తీసి బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తారు

నగ్నంగా ఉండి కాల్ చేస్తారు.. ఇటువైపు వ్యక్తిని అలాగే చూడాలని ఉందని చెప్పి స్క్రీన్ షాట్లు తీసి బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తారు

పెద్ద చదువులు చదవలేదు. ఇంటర్నెట్‌ గురించి తెలిసింది కూడా అంతంత మాత్రమే. అలాంటి వారు ఆన్‌లైన్‌లో ఆరితేరిపోయి తాము ఎవరో తెలియకుండా.. పోలీసులకు చిక్కకుండా పక్కాగా క్రైమ్స్‌ చేసే తెలివిని మాత్రం సొంతం చేసుకున్నారు.

ఒకప్పుడు కిడ్నాప్స్‌, మర్డర్స్‌, దొంగతనాలకు పెట్టింది పేరుగా ఉండే రాజస్థాన్‌ భరత్‌పూర్‌ గ్యాంగ్‌లు ఇప్పుడు సైబర్‌ క్రైమ్స్‌కు అలవాటుపడ్డాయి. వీరి ప్లానింగ్‌కు మోసపోయి పరువు పోతుందనే మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇలా మెంటల్ టార్చర్‌ పెడుతున్న గ్యాంగ్‌ల బారిన పడుతున్న వారి సంఖ్య నెల రోజుల్లో 50కి పైగానే ఉందని పోలీసులు చెబుతున్నారు.

కొందరు సైబర్‌ క్రిమినల్స్‌ అందమైన ప్రొఫైల్‌ పిక్స్‌తో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. మెస్సేజ్‌లతో ట్రాప్ చేసి.. ఆ తర్వాత వాట్సాప్‌ నంబర్లు తీసుకుంటారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత అసభ్య పదజాలంతో చాటింగ్‌ మొదలుపెట్టి.. మధ్యలో ఒకరోజు నగ్నంగా కనిపిస్తారు. ముఖం మాత్రం చూపించకుండా జాగ్రత్త పడుతారు.

బంగారం కోసం..మూడుముళ్లు వేసిన 3 నిమిషాలకే భార్యను వదిలేసి పరార్
నువ్వు కూడా నాలాగే చాటింగ్‌ చేయు అంటూ రెచ్చగొడతారు. లైంగిక వాంఛను ఆసరాగా చేసుకొని బురిడీ కొట్టిస్తారు. ఆ చాటింగ్ మొత్తాన్ని రికార్డు చేసి తర్వాతి రోజు వాట్సాప్‌లో పంపించి బెదిరింపులకు దిగుతారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. ఫేస్‌బుక్‌లో సదరు వీడియోలను పోస్ట్‌ చేస్తామని బెదిరిస్తారు. పరువు పోతుందనే భయంతో కొందరు అడిగినంతా ఇచ్చేస్తుండగా.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళ్తున్నారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓ వ్యాపారి ఇటీవల ఇలాంటి ఉచ్చులోనే పడ్డాడు. డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ వ్యక్తి వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించిన వ్యాపారి సదరు వీడియోలను డిలీట్‌ చేయించుకున్నాడు. కొందరు మాత్రం ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చి.. వీడియోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించుకుంటున్నారు.

ట్రై కమిషనరేట్ల పరిధిలో నెల రోజుల్లోనే ఇలాంటి కేసులు 50 వరకు వచ్చినట్లు సమాచారం.