Rajasthan farmers: అన్నదాతలకు ఆర్థిక సాయం.. నెలకు రూ. వెయ్యి

రాజస్థాన్ రాష్ట్రంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు అక్కడి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

Rajasthan farmers: అన్నదాతలకు ఆర్థిక సాయం.. నెలకు రూ. వెయ్యి

Farmars

Rajasthan farmers: రాజస్థాన్ రాష్ట్రంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు అక్కడి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ‘కిసాన్ మిత్రా ఉర్జా యోజన’ పథకం కింద రాజస్థాన్‌లోని రైతులకు నెలవారీ రూ. వెయ్యి గ్రాంట్ ఇచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ పథకం కింద ఏటా రూ .1,450 కోట్ల అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. అయితే, వ్యవసాయ అవసరాలకు విద్యుత్తు రాష్ట్రంలోని చిన్న, మధ్యతరగతి రైతులకు దాదాపు ఉచితం విద్యుత్ అందుతుంది అని ప్రభుత్వం చెబుతుంది. వ్యవసాయ కనెక్షన్లపై నెలకు రూ.వెయ్యి గ్రాంట్ లేదా విద్యుత్ ఖర్చుపై గరిష్టంగా రూ.12వేల గ్రాంట్ ఇస్తామని గెహ్లాట్ స్పష్టంచేశారు.

రాజస్థాన్‌లో ఈ పథకం ప్రధాన లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడమేనని ముఖ్యమంత్రి వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న రైతులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంవత్సరానికి గరిష్ఠంగా రూ.12వేలు అందిస్తామని చెప్పారు. కోవిడ్ ప్రభావం అన్నదాతల మీద కూడా విపరీతంగా పడిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ రేటు యూనిట్‌కు రూ. 5.55 ఉంటే, రైతులకు యూనిట్‌ 90 పైసలు మాత్రమే పడుతోంది. మిగిలిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. వ్యవసాయ విద్యుత్ రేట్లపై సబ్సిడీ కారణంగా, ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వంపై 16వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది.

అయినా రైతులకు మేలు చేసేందుకు భరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. “రాజస్థాన్ అంతటా కొత్త ఎలక్ట్రిక్ గ్రిడ్లు, లైన్లు మరియు సబ్‌స్టేషన్లను అభివృద్ధి చేయడం ద్వారా నెట్‌వర్క్ బలోపేతం అవుతోంది” అని సీఎం చెప్పారు.