Bus Accident: నడిరోడ్డుపై బస్సు దగ్ధం.. 12మంది సజీవ దహనం

రాజస్ధాన్‌లోని బర్మేర్ ప్రాంతంలో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. బల్మేర్-జోధ్ పూర్ హైవేపై బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 12మంది వరకూ మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసింది.

Bus Accident: నడిరోడ్డుపై బస్సు దగ్ధం.. 12మంది సజీవ దహనం

Rajsthan Barmer

Bus Accident: రాజస్ధాన్‌లోని బర్మేర్ ప్రాంతంలో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. బల్మేర్-జోధ్ పూర్ హైవేపై బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 12మంది వరకూ మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసింది. 25 మంది ప్రయాణికులతో వెళుతోన్న బస్సును ఎదురుగా దూసుకొచ్చిన ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బస్సులో ఒక్కసారే మంటలు చెలరేగడంతో.. ప్రయాణికుల్లో ఆందోళన మొదలై దిగడానికి ఒక్కసారిగా ప్రయత్నించారు.

తొక్కిసలాటలో ఉండగానే మంటలు చెలరేగి.. బయటపడేందుకు అవకాశం లేకుండా క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టేశాయి. దాదాపు 12 మంది ప్రయాణికులు సజీవదహనం అయినట్లు చెబుతున్నారు.

సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై ఫైరింజన్లతో మంటలు ఆర్పి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు పంపించారు. ఉదయం 9గంటల 55నిమిషాలకు బలోత్రాలో బస్సు బయలుదేరిందని, హైవేపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా దూసుకొచ్చిన ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ట్యాంకర్ డ్రైవర్ తప్పిదమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు.

………………………………………… : టీచర్ మిత్ర క్యారెక్టర్‌కి స్పూర్తి ఈమే..

సీఎం గెహ్లాట్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే మదన్ ప్రజాపత్, ఇంచార్జి మంత్రి సుఖ్ రామ్ విష్ణోయ్ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.