దీపావళి షాక్….టపాసుల విక్రయాలపై నిషేధం

  • Published By: venkaiahnaidu ,Published On : November 2, 2020 / 10:28 AM IST
దీపావళి షాక్….టపాసుల విక్రయాలపై నిషేధం

Rajasthan government imposes blanket ban on sale of firecrackers దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ లో రాష్ట్రంలో టపాసుల అమ్మకాలను బ్యాన్ చేస్తున్నట్లు అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.



రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆదివారం సీఎం అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్ సమయంలో ఈ నిర్ణయం తీసుకోబడిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నో మాస్క్..నో ఎంట్రీ మరియు వార్ ఫర్ ది ప్యూర్ క్యాంపెయిన్ ఏ విధంగా ముందుకెళ్తుందనేదానిపై సమీక్ష జరిగిందని..అన్ లాక్-6 నిబంధనలపై కూడా మీటింగ్ లో చర్చ జరిగిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.



https://10tv.in/ap-government-ban-on-other-states-liquor/
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందుజాగ్రత్త చర్యగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం అశోక్ గెహ్లోత్ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వానికి ముఖ్యమని గెహ్లోత్ అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు దీపావళి రోజుల బాణసంచా కాల్చకుండా ఉండాలని సీఎం తెలిపారు.



అంతేకాకుండా, ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగే వాహనాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదేవిధంగా, నవంబర్-16వరకు రాష్ట్రంలో పాఠశాలలు,కాలేజీలు మూసివేసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.

రాజస్థాన్ లో 2వేల మంది డాక్టర్ల నియామక ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని సీఎం తెలిపారు. సెలక్టెడ్ డాకర్టలకు కేవలం 10రోజుల్లో అపాయింట్ మెంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు.