వెయ్యి చలానా కడితే హెల్మెట్ ఫ్రీ

వెయ్యి చలానా కడితే హెల్మెట్ ఫ్రీ

ట్రాఫిక్ రూల్స్ మీరితే ఫైన్‌లు వేయడం మాత్రమే కాదు.. ఆ ఫైన్లు సకాలంలో చెల్లిస్తే గిఫ్ట్‌లు కూడా ఇస్తున్నారు. ఇటీవల కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఫైన్‌లు భారీగా పెరిగిపోయాయి. వీటిపై రాజస్థాన్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. ఎవరైతే వెయ్యి రూపాయలు విలువ ఉన్న ఒక చలానా కడతారో వారికి ఫ్రీ హెల్మెట్ ఇస్తారు. 

ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ప్రతాప్ సింగ్ ఖచరియావస్ బుధవారం మీడియా మాట్లాడుతూ ఈ  విషయాన్ని ప్రకటించారు. రాజస్థాన్‌లో కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి తీసుకురావడం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరైతే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి వెయ్యి రూపాయలు జరిమానా కడతారో.. వారికి ఫ్రీ హెల్మెట్ లు ఇస్తారు. 

రెండ్రోజుల ముందు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కొత్త మోటారు చట్టంపై స్పందించారు. ఫైన్ అమౌంట్ పెంచడం కాదని ట్రాఫిక్ భద్రతపై అవగాహనను మాత్రమే పెంచుతున్నామని తెలిపారు. ‘వెయ్యి రూపాయల చలానాకు హెల్మెట్ ఇవ్వడం బాగుందని వాహనదారులకు ఇది చాలా సేఫ్’ అని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురావడానికి కంగారుపడడం లేదని వెల్లడించారు.