Omicron : రాజస్తాన్ లో ఒమిక్రాన్ కలకలం..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబం మొత్తానికి కరోనా
: జైపూర్లోని దాదీ కా ఫాటక్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులకు తాజాగా కొవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. వీరందరూ ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి

Jaipur
Omicron : జైపూర్లోని దాదీ కా ఫాటక్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులకు తాజాగా కొవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. వీరందరూ ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగివచ్చారు. అయితే వారికి ఒమిక్రాన్ వేరియంటే సోకిందేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి సేకరించిన శాంపిలస్ ను జన్యు పరీక్షల కోసం పంపారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఐసొలేషన్లో ఉందని, వారితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా,అందులోని ఓ బాధితుడు కోవిడ్ టెస్ట్ ఫలితం వచ్చే ముందే దుబాయ్ వెళ్లిపోయాడు. ఇక,రెండో బాధితుడు బెంగళూరులోనే ఓ డాక్టర్. అయితే అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా కూడా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది.
మరోవైపు,ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో కోవిడ్ నిర్ధరణ పరీక్షలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్ తప్పించుకోలేదని పేర్కొంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వివిధ విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నవారిపై సమర్థ నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించింది.
ALSO READ Omicron : డెల్టాతో పోలిస్తే..రీ ఇన్ఫెక్షన్స్ మూడు రెట్లు ఎక్కువ!
ALSO READ Omicron : అమెరికాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..న్యూయార్క్ లో కొత్తగా ఐదు