Rape Cases : అత్యాచార కేసుల్లో రాజస్థాన్‌ టాప్‌..రెండో స్థానంలో యూపీ : NCRB

దేశ వ్యాప్తంగా జరిగిన అత్యాచారాల కేసుల్లో రాజస్థాన్ టాప్ లో ఉండగా..యూపీ రెండో స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2020 డేటాను వెల్లడిచింది.

10TV Telugu News

NCRB Data  : భారత్ లో అత్యాచారం జరగని రోజంటూ లేదు. ఎక్కడోచోట ఏదోక మూల ఆడబిడ్డలకు అత్యాచారాలకు బలైపోతునే ఉన్నారు. కానీ అన్నీ లెక్కల్లోరి రావటంలేదు. కానీ లెక్కల్లోకి వచ్చి కేసులు కూడా తక్కువేమీ కాదు. కానీ లెక్కకు రాని దారుణాలు అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎన్నో ఎన్నెన్నో. ఈ క్రమంలో అత్యాచారాల కేసుల గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2020 డేటాను వెల్లడిచింది. ఈ డేటా ప్రకారంగా చూస్తే అత్యాచార కేసుల్లో టాప్ లో రాజస్థాన్ ఉంది.ఆ తరువాత రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. సాధారణంగా అత్యాచారాలు అనగానే యూపీయే ఠక్కున గుర్తుకొస్తుంది. అన్ని దారుణాలకు యూపీలోనే జరిగాయి. జరుగుతున్నాయి. కానీ యూపీని మించిపోయింది రాజస్థాన్ అని NCRB డేటా వెల్లడించింది.

దేశంలో నమోదైన అత్యాచార కేసుల్లో రాజస్థాన్‌ టాప్‌లో ఉండగా యూపీ రెండో స్థానంలోను, మధ్యప్రదేశ్‌ మూడో స్థానంలోను నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020 డేటా పేర్కొంది. ఈ గణాంకాల ప్రకారం గత ఏడాది అంటే 2020లో రాజస్థాన్‌లో అత్యధికంగా 5,310 అత్యాచార కేసులు నమోదు కాగా..యూపీలో 2,769 అత్యాచారా కేసులు, మధ్యప్రదేశ్ లో 2,339 కేసులు, ఇక 2,061 కేసులతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఉన్నాయి. లైంగిక దాడి బాధితుల్లో 4,031 మంది మహిళలు ఖాగా..1,279 మంది 18 ఏళ్లలోపువారే కావటం గమనించాల్సిన విషయం. ఈ నేరాలకు పాల్పడిన నిందితుల్లో ఎక్కువగా కుటుంబ సభ్యులు, స్నేహితులు,ఇరుగు పొరుగువారే ఉన్నారు.

ఈ క్రమంలో రాజస్థాన్‌లో మహిళాలపై నేరాలు 16 శాతం తగ్గాయని NCRB రిపోర్ట్‌ పేర్కొంది. అంటే నమోదు అయినవాటిలో కొన్ని రాంగ్ కంప్లైంట్స్ గా నిర్ధారణ అయ్యాయి. 2020లో మహిళాలపై నేరాలకు సంబంధించి 49,385 కేసుల నమోదుతో ఉత్తరప్రదేశ్‌ టాప్‌లో ఉండగా, 36,439 కేసులతో పశ్చిమ బెంగాల్‌ రెండో స్థానంలో, 34,535 కేసులతో రాజస్థాన్‌ మూడో స్థానంలో ఉన్నాయి.మరోవైపు ఎస్సీ నేరాలపరంగా కూడా రాజస్థాన్‌ టాప్‌లో ఉన్నది. 2018 నుంచి 2020 వరకు ఈ క్రైమ్‌ రేటు 57.4 శాతానికి పెరిగింది. ఎస్సీ నేరాలకు సంబంధించి 2018లో 4,607 కేసులు, 2019లో 6,794, 2020లో 7,017 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.

రాజస్థాన్ లో అత్యాచార కేసుల విషయంలో నేర విభాగం ఏడీజీ రవి ప్రకాష్ మెహర్దా మాట్లాడుతూ..రాజస్థాన్‌లో అత్యాచార కేసులు ఎక్కువగా నమోదైనప్పటికీ అందులో 42 శాతం తప్పుడు ఆరోపణలేనని దర్యాప్తులో తేలిసిందని తెలిపారు. నేరాలు పెరగడం, పోలీసులు నమోదు చేసే నేరాలు పెరగడం అనేవి రెండు వేర్వేరు విషయాలని..ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు.

 

10TV Telugu News