Rajasthan SDM : రైతును తన్ని కూతుర్ని ఈడ్చి పారేసిన అధికారి

రాజస్థాన్ లోని ఓ గ్రామంలో ప్రభుత్వ అధికారి ఓ రైతును కాలితో తన్నాడు. ఆ తరువాత ఆ రైతు కూతుర్ని కొంతదూరం ఊడ్చుకెళ్లి తోసిపారేసాడు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సదరు అధికారిపై విరుచుకుపడటంతో పోలీసులు రంగంలోకి దిగి సర్ధిచెప్పటానికి యత్నించిన క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

Rajasthan SDM : రైతును తన్ని కూతుర్ని ఈడ్చి పారేసిన అధికారి

Rajasthan Sdm Kicks Farmers

Rajasthan SDM kicks farmers : అధికారం చేతిలో ఉంది కదాని కొంతమంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు సామాన్య ప్రజలతో అనాగరికంగా వ్యవహరిస్తుంటారు. అదే జరిగింది రాజస్థాన్ లోని ఓ గ్రామంలో. ఓ ప్రభుత్వ అధికారి ఓ రైతును అత్యంత దారుణంగా కాలితో తన్నాడు. ఆ తరువాత అంతకంటే దారుణంగా ఆ రైతు కూతుర్ని కొంతదూరం ఊడ్చుకెళ్లి తోసిపారేసి పోయాడు. ఈ దారుణంపై గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

అది రాజస్థాన్ జలోరి జిల్లాలోని శాంఖోర్ ఏరియాలోని ప్రతాప్పురా గ్రామం. ఈ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఈ రోడ్డు నిర్మాణంలో కొంతమంది రైతులకు సంబంధించి భూమి వెళ్లింది. వారి భూమిమీదుగా రోడ్డు నిర్మాణం వేస్తున్నారు. భూమికి సంబంధించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. కానీ నష్టపరిహారం ఇవ్వకుండానే రోడ్డు నిర్మాణం జరుగుతుండంటో రైతులు తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని అడిగారు.రోడ్డు పనులను రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతుల మీద అక్కడే ఉన్న భూపేంద్ర యాదవ్ అనే ఎస్ డిఎం అధికారి రెచ్చిపోయాడు. నర్శింగ్ రామ్ చౌదరి అనే రైతును కాలితో తన్నాడు.దాంతో రైతు కిందపడిపోయాడు. దీంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. నష్టపరిహారం అడిగితే ఇలా దారుణంగా ప్రవర్తిస్తారా? అంటూ సరదు అధికారిపై రైతులు, మహిళలూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆ అధికారి 15 ఏళ్ల బాలికను ఈడ్డుకుపోయి.. కొంత దూరం వెళ్లాక తోసేశాడు. దాంతో బాలిక కిందపడిపోయింది. అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి దెబ్బలు తగలకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ గలాటాను అక్కడే ఉన్న పోలీసులు రెండువైపులా శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఊళ్లో రైతులంతా వచ్చి పోలీసులపై తిరగబడ్డారు. చిన్నపాటి యుద్ధం వాతావరణం జరిగిందక్కడ. దీనిపై సదరు అధికారి మాట్లాడుతూ..అమృత్‌సర్ నుంచి జామ్‌నగర్ వరకు ఎక్స్‌ప్రెస్‌వే 754 నిర్మాణం జరగుతుండగా ప్రతాపుర శివార్లలో రైతులు తనతో వాగ్వాదం పెట్టుకుని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతు ఓ రైతు కర్రతో తన వైపు వస్తుండటంతో నేను ఆత్మరక్షణలో కోసం తన్నాల్సి వచ్చిందని తెలిపారు.