Rajasthan: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుల్వామా అమరవీరుల సతీమణుల నిరసన.. హామీలు నెరవేర్చాలని డిమాండ్
2019లో పుల్వామా దాడిలో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం తమ హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ అమరవీరుల సతీమణులు ఆదివారం నిరసనకు దిగారు.

Rajasthan: సైనిక అమరవీరుల కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వాల వైఖరి విమర్శల పాలవుతోంది. గాల్వాన్ ఘర్షణలో అమరుడైన ఒక సైనికుడి తండ్రిని బిహార్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి.
Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ
ఈ ఘటన మరువక ముందే అమరవీరులకు సంబంధించి మరోసారి ప్రభుత్వ వైఖరి విమర్శల పాలవుతోంది. 2019లో పుల్వామా దాడిలో అనేక మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం తమ హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ అమరవీరుల సతీమణులు ఆదివారం నిరసనకు దిగారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
Toll Tax Hike: కేంద్రం మరో బాదుడు.. టోల్ ట్యాక్స్ పెంపునకు రంగం సిద్ధం.. ఏప్రిల్ 1 నుంచి అమలు
ముగ్గురు మహిళలు సీఎం అశోక్ గెహ్లాట్‌ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆ మహిళలు ఆరోపించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు. లేదంటే తమ ప్రాణాలు తీసుకునేందుకైనా అనుమతివ్వాలని గవర్నర్‌ను కోరారు. ఈ అంశంపై రాజస్థాన్ మంత్రి ఖచారియావాస్ స్పందించారు. అమరవీరుల కుటుంబల్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Right To Pee: నాగ్‌పూర్‌లో పబ్లిక్ టాయిలెట్ల కోసం మహిళల ఉద్యమం.. ప్లకార్డులతో నిరసన
అన్ని రకాలుగా సాయం చేస్తామన్నారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటామని చెప్పారు. అమరవీరుల కుటుంబాల నిరసనలో బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం అమరవీరుల కుటంబాల్ని రాజస్థాన్ ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.