దీపావళి పూజ చేస్తున్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రేపిస్ట్

10TV Telugu News

rajasthan woman: దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ చేసుకుని, స్వీట్స్ తిని, టపాసులు కాల్చుకుంటూ ఆనందోత్సాహాలతో ఉంటే.. ఆ మహిళ మాత్రం ఆగ్నికి బలైంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో 37ఏళ్ల మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు రేపిస్ట్.

ఈ ఏప్రిల్‌లో లేఖ‌రాజ్ అనే వ్యక్తి మహిళను రేప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు కంప్లైంట్ ఫైల్ అయింది. నిందితుడిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. శనివారం రాత్రి సమయంలో దీపావళి సందర్భంగా మహిళ ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటుంది.అదే సమయంలో ఇంట్లో ఎంటర్ అయి పెట్రోల్ పోసి దీపాన్ని విసిరేసి పారిపోయాడు. బాధితురాలిని ఎస్ఎమ్ఎస్ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. నిందితుడిపై మరోసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అరెస్టు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

10TV Telugu News