Rajasthan : రైల్వేస్టేషన్‌లో పనిచేసే స్వీపర్‌కు ప్రసవం చేసిన పోలీసులు .. తల్లీ బిడ్డలు క్షేమం

చేసేది పోలీసు ఉద్యోగమే అయినా పోలీసులు ఓమహిళకు ప్రసవం చేశారు. తల్లికి పునర్జన్మను బిడ్డకు జన్మను ప్రసాదించారు. నలుగురు మహిళా కానిస్టేబుల్స్ చొరవతో తల్లీ బిడ్డలకు క్షేమంగా ఉన్నారు.

Rajasthan : రైల్వేస్టేషన్‌లో పనిచేసే స్వీపర్‌కు ప్రసవం చేసిన పోలీసులు .. తల్లీ బిడ్డలు క్షేమం

Women constables  Delivery railway sweeper

Women constables  Delivery railway sweepe : చేసేది పోలీసు ఉద్యోగమే అయినా పోలీసులు ఓమహిళకు ప్రసవం చేశారు. తల్లికి పునర్జన్మను బిడ్డకు జన్మను ఇచ్చారు. రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ రైల్వేస్టేషన్‌లో గురువారం (జూన్ 1,2023) ఉదయం ఓ స్వీపర్‌ గర్భంతో ఉంది. పనిచేస్తేనే గానీ గడవని పరిస్థితి. దీంతో నిండు గర్భంతో ఉన్న రోజువలెనే పనికి వచ్చింది. రైల్వే స్టేషన్ ను శుభ్రం చేస్తుండగా సడెన్ గా పురిటి నొప్పులొచ్చాయి. మహిళకు ప్రసవం పునర్జన్మతో సమానం అంటారు. పురిటి నొప్పులతో విల్లలాడిపోతున్న ఆమెను చూసిన కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ ప్రసవం చేశారు. వారి సహాయంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిందా మహిళ.

 

రాజస్థాన్ లోని అజ్మీర్ రైల్వేస్టేషన్ లో స్వీపర్ గా పనిచేస్తున్న పూజ నిండు గర్భిణి. ప్లాట్ ఫామ్ ను శుభ్రం చేస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. నొప్పులతో విలవిల్లాడిపోయింది. నొప్పులతో పూజల పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. ఆమె బాధ గుర్తించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ప్రేమారావుకు ఫోన్ చేసిన సమాచారం అందించారు. ఆమె బాధ చూడలేకపోతున్నాను ఏదైనా సహాయం కావాలని కోరారు.

 

ఆయన వెంటనే మహిళా కానిస్టేబుల్స్ సావిత్రి ఫాగేడియా, హంస కుమారి, లక్ష్మీవర్మలను పంపించారు. అప్పటికే నొప్పులు తీవ్రం కావటంతో పూజ విలవిల్లాడిపోతోంది. రక్తస్రావం కూడా అవుతోంది. అది చూసిన కానిస్టేబుల్స్ వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేకపోవటంతో వారే ప్రసవం చేయాలనుకున్నారు. కానీ ఏం జరుగుతుందోననే ఆందోళన. ఆలోచించే సమయం కూడా లేదు. దీంతో దేవుడిపై భారం వేసి కానిస్టేబుల్స్ అక్కడే ఓ దుప్పటి చుట్టు అడ్డంగా పెట్టి.. పూజకు ప్రసవం చేయటంలో సహాయం చేశారు.ఓర్చుకోమ్మా..చక్కటి బిడ్డ పుడుతుంది అంటూ అనునయ మాటలు చెబుతు పూజకు ప్రసవం చేశారు. పూజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

 

ప్రసవం తరువాత పూజను,పురిటిగుడ్డును స్థానికంగా ఉన్న సాటిలైట్ ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డలకు చేయాల్సిన ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు తల్లీ బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆ మాటలు విన్న మహిళా కానిస్టేబుల్స్ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మహిళా కానిస్టేబుల్స్ చేసిన సహాయానికి తల్లీ పూజ ధన్యవాదాలు చెప్పింది. కష్టంలో ఆదుకున్నారు అక్కా మీ రుణం తీర్చుకోలేను అంటూ ధన్యవాదాలు తెలిపింది. కానిస్టేబుల్స్ ను చేసిన పనికి ఉన్నతాధికారులు అభినందించారు.