Punishment : యువకుడికి చెప్పుల దండ వేసి మూత్రంలో ముంచి ఊరేగించిన గ్రామస్తులు

ఓ యువకుడికి మెడలో చెప్పుల దండ వేసి..మూత్రంలో స్నానం చేయించి ఊరంతా ఊరేగించారు రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు. ఎందుకంటే..

Punishment : యువకుడికి చెప్పుల దండ వేసి మూత్రంలో ముంచి ఊరేగించిన గ్రామస్తులు

Rajasthan Man Eve Teasing

Rajasthan man eve teasing : ఓ యువకుడికి మెడలో చెప్పుల దండ వేసి..మూత్రంలో స్నానం చేయించి ఊరంతా ఊరేగించారు రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు. అయ్యో అని అనుకుంటున్నారా? ఈ శిక్ష కాస్త అమానవీయమే అయినా సదరు యువకుడు చేసింది..చేసేది మాత్రం తక్కువేం కాదు. కంటకి కనిపించిన ఆడపిల్లలు అసభ్యంగా వేధించటం ఈ యువకుడికి పని. కంటికి ఆడవాళ్లు కనిపిస్తే చాలు వయస్సుతో పనిలేదు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడతాడు. చెప్పటానికి వీలుకాని పదాలతో వేధించటం వీడి పని.

భిల్వారా జిల్లాలోనిథాలియో కా ఖేడా గ్రామంలో ఓ యువకుడు ఊరిలో జులాయిగా తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తుంటాడు. కంటికి కనిపించిన యువతుల వెంట పడి అసభ్యంగా మాట్లాడుతూ..వేధిస్తుంటాడు. ఈక్రమంలో గత శనివారం (జూన 20,2021) రాత్రి ఒక ఇంట్లోకి దూరి ఒంటరిగా ఉన్న అమ్మాయిని అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశాడు. అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆ యువతి పెద్దగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు వచ్చి అతడిని పట్టుకున్నారు.

ఈ ఘటన తరువాత వీడి చాలాసార్లు మమ్మల్ని వేధించాడని ఒకరు తరువాత మరొకరు చెప్పటంతో సర్పంచ్ వరకూ ఈ వ్యవహారం వెళ్లటం వాడు వేధింపుల గురించి పలువురు యువతులు, మహిళలు చెప్పటంతో బుద్ధి చెప్పాలని సర్పంచ్ నిర్ణయించటంతో అతడి మెడలో చెప్పుల దండ వేసి..గ్రామస్తుల మూత్రంతో స్నానం చేయించి ఊరంతా ఊరేగించారు. ఈక్రమంలో అతడి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. మరోసారి ఆడవాళ్ల జోలికొస్తే బాగుండదంటూ హెచ్చరించి సదరు జులాయి యువకుడిని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనపై సర్పంచ్ సన్వర్ సేన్ మాట్లాడుతూ..గ్రామంలో అమ్మాయిలను..మహిళలను పలు రకాలుగా వేధిస్తున్న ఇతనికి బుద్ది చెప్పామని పోలీసులకు అప్పగించామని..గ్రామంలో గానీ గ్రామం వెలుపల గానీ ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.అతనికి బుద్ధి చెప్పేందుకే అందరూ కలిసి ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటన వైరల్ అయినా స్థానిక పోలీసులు మాత్రం ఆ వీడియోపై స్పందించలేదు.