Rajendra Paul Gautam: అంబేద్కర్ 22 ప్రమాణాల కాంట్రవర్సీ.. రాజీనామా చేసిన ఢిల్లీ మంత్రి

1956లో ఇదే రోజున డాక్టర్ అంబేద్కర్.. హిందూ మతాన్ని వదిలేసి మౌద్ధాన్ని స్వీకరించారు. దానిని అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు ధమ్మ చక్ర పరివర్తన్ దినంగా జరుపుకుంటారు. దీని గుర్తుగా కొంత మంది జన సమూహం బౌద్ధం తీసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన అంబేద్కర్ చేసిన 22 బౌద్ధ ప్రమాణాలు పటిస్తుండగా గౌరవంగా నిల్చున్నారు.

Rajendra Paul Gautam: అంబేద్కర్ 22 ప్రమాణాల కాంట్రవర్సీ.. రాజీనామా చేసిన ఢిల్లీ మంత్రి

Rajendra Pal Gautam resigns from Delhi Cabinet amid row over conversion event

Rajendra Paul Gautam: రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక సభలో నిమ్న వర్గాలకు చెందిన కొంత మంది పెద్ద ఎత్తున బౌద్ధ మతం తీసుకున్నారు. ఇందులో భాగంగా 1956లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ బౌద్ధం తీసుకున్న సమయంలో చేసిన 22 బౌద్ధ ప్రమాణాలు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తాజాగా రాజీనామా చేశారు. హిందూ దేవుళ్ల ఉనికిని విశ్వసించమంటూ బౌద్ధం స్వీకరించే సమయంలో ఆయన అక్కడే ఉండడం పెద్ద కాంట్రవర్సీకి కారణమైంది. అధికారిక బీజేపీ సహా ఇతర పార్టీలు రాజేంద్ర పాల్‭పై విరుచుకుపడ్డాయి.

రాజేంద్ర తన రాజీనామా లేఖను ట్విట్టర్ ఖాతాలో ఆదివారం షేర్ చేస్తూ ‘‘ఈరోజు మహర్షి వాల్మీకి అభివ్యక్తి దినం. అంతే కాకుండా మాన్యవర్ కాన్షీరాం సాహేబ్ వర్ధంతి కూడా. ఇటువంటి రోజున నేను అనేక సంకెళ్ల నుంచి విముక్తి పొందాను. ఈరోజు నేను మళ్లీ జన్మించాను. ఇప్పుడు నేను ఎలాంటి ఆంక్షలు లేకుండా మరింత దృఢంగా సమాజంపై హక్కులు, దౌర్జన్యాల కోసం పోరాడుతాను’’ అని ట్వీట్ చేశారు.

సెప్టెంబర్ 6న ఢిల్లీలో నిర్వహించిన బౌద్ధ సమ్మేళనంలో అంబేద్కర్ ముని మనుమడు రాజరత్న అంబేద్కర్‭తో పాటు రాజేంద్ర పాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1956లో ఇదే రోజున డాక్టర్ అంబేద్కర్.. హిందూ మతాన్ని వదిలేసి మౌద్ధాన్ని స్వీకరించారు. దానిని అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు ధమ్మ చక్ర పరివర్తన్ దినంగా జరుపుకుంటారు. దీని గుర్తుగా కొంత మంది జన సమూహం బౌద్ధం తీసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన అంబేద్కర్ చేసిన 22 బౌద్ధ ప్రమాణాలు పటిస్తుండగా గౌరవంగా నిల్చున్నారు. అంతే.. హిందుత్వాన్ని రాజేంద్ర పాల్ అవమానించారంటూ భారతీయ జనతా పార్టీ సహా ఇతర రైట్ వింగ్ గ్రూపులు ఒంటి కాలిపై లేస్తున్నాయి.

అంబేద్కర్ చేసిన ప్రమాణాల్లో ఏముంది?
తాను హిందువుగా పుట్టాను కానీ, హిందువుగా చావనని చెప్పిన డాక్టర్ అంబేద్కర్.. 1956 అక్టోబర్ 6న ఢిల్లీలోని అలీపూర్ మైదానంలో లక్షలాది మందితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అయితే బౌద్ధం తీసుకునే సమయంలో ఆయన 22 ప్రమాణాలు చేశారు. అందులో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను దేవుళ్లుగా భావించనని.. పార్వతి, లక్ష్మీ, గణపతులకు పూజలు చేయనని, ఇలా హిందూ దేవుళ్లను నమ్మనని, వారి విశ్వాసాలను పాటించనని ప్రమాణం చేశారు. చాలా చోట్ల బౌద్ధాన్ని స్వీకరిస్తున్న క్రమంలో ఈ ప్రమాణాలు చేస్తున్నారు.

అయితే ఇలా ప్రమాణాలు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొనడంపై బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. మంత్రితోనే ఆగకుండా.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‭ను సైతం ఇందులోకి లాగుతూ కేజ్రీవాల్, ఆప్ హిందుత్వ వ్యతిరేకి అంటూ మండిపడుతున్నారు. సొంత పార్టీ నుంచి కూడా రాజేంద్రకు సెగ తప్పలేదు. దీంతో రాజీనామా చేసి రాజీలేని సామాజిక పోరుకు సిద్ధం కావాలని రాజేంద్ర నిర్ణయించుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు.

Viaral Video: బుద్ధిజం కార్యక్రమంలో ‘అంబేద్కర్ 22 ప్రమాణాలు’.. పాల్గొన్న ఢిల్లీ మంత్రి.. హిందుత్వాన్ని అవమానించారంటూ మండిపడుతున్న బీజేపీ